Asianet News Telugu

కోహ్లీ సేన వరల్డ్ కప్ ఫైట్.. సల్మాన్ కి దడ మొదలైంది?

 

రేపటి నుంచి వరల్డ్ కప్ లో అసలైన యుద్ధం మొదలుకానుంది. కోహ్లీ సేన మొదటి మ్యాచ్ గెలవాలని భారతీయులందరు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ సల్మాన్ ఖాన్ కి మాత్రం గుండెలో దడ మొదలైందని చెప్పవచ్చు. 

Ind vs SA match effect on salman bharat openings
Author
Hyderabad, First Published Jun 4, 2019, 11:54 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రేపటి నుంచి వరల్డ్ కప్ లో అసలైన యుద్ధం మొదలుకానుంది. కోహ్లీ సేన మొదటి మ్యాచ్ గెలవాలని భారతీయులందరు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కానీ సల్మాన్ ఖాన్ కి మాత్రం గుండెలో దడ మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే రేపే సల్మాన్ భరత్ సినిమా ఇండియాలో 4500 స్క్రీన్స్ లలో రిలీజ్ కాబోతోంది. 

ఇక ప్రపంచం మొత్తంలో సల్మాన్ కి భారత అభిమానులు ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా vs ఇండియా మ్యాచ్ కోసం వారు ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. వరల్డ్ కప్ లో ఇండియాకు మొదటి మ్యాచ్ కావడం అలాగే సెలవు దినం కావడంతో వరల్డ్ కప్ మ్యాచ్ ను అత్యధిక మంచి వీక్షించే అవకాశం ఉంది. ఈ దెబ్బతో సల్మాన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ కి ఏ స్థాయిలో ఎఫెక్ట్ పడుతుందో చెప్పలేము. 

మొదటి రోజు భరత్ 30కోట్లకు పైగా కలెక్షన్స్ ను అందుకునే అవకాశం ఉన్నట్లు సినీ పండితులు అంచనా వేస్తున్నారు. భరత్ సినిమాపై అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి మరి ఈ సినిమాకు క్రికెట్ మ్యాచ్ ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుందో చూడాలి. 130కోట్ల బారి బడ్జెట్ తో నిర్మించిన భరత్ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు.

Follow Us:
Download App:
  • android
  • ios