గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు ఎంతో నాజుకుగా ఉండేది. ఆమె నడుముకి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. దర్శకులు సినిమాలో ఇలియానా నాభి అందాలను చూపించడానికి ఆసక్తి చూపేవారు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈమె బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంది.

కానీ అక్కడ అవకాశాలు పెద్దగా రాకపోవడంతో కొంతకాలం  పాటు సినిమాలు లేకుండా ఉంది. దీంతో టాలీవుడ్ పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రవితేజ సరసన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఇలియానా బొద్దుగా కనిపించింది.

సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆమెని చూసిన వారంతా షాకయ్యారు. బొద్దుగా తయారై మునుపటి క్రేజ్ ని పోగొట్టుకుంది. దీంతో తిరిగి తన పాత లుక్ లోకి రావాలని  నిర్ణయించుకుంది. దీంతో వర్కవుట్లు చేయడం మొదలుపెట్టింది. జిమ్ లో ఎక్కువ సమయం గడపడంతో పాటు డైట్ ఫాలో అవ్వడంతో అమ్మడు తక్కువ సమయంలోనే బరువు బాగా తగ్గింది.

రీసెంట్ గా ముంబైలోని బాంద్రా ఏరియాలో కనిపించింది ఇలియానా. ఎంతో స్లిమ్ గా నాజుకుగా కనిపించి షాక్ ఇచ్చింది.  ప్రింటెడ్ కలర్స్ ఉన్న స్లీవ్ లెస్ గౌన్ లో సూపర్ స్టైలిష్ గా కనిపించింది ఇలియానా. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో బ్రేకప్ చేసుకున్న ఇలియానా సినిమాల మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'పాగల్ పంటి', 'ది రెడ్ బుల్' అనే రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది.