గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది.

గోవా భామ ఇలియానా పోకిరి చిత్రంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. నాజూకు నడుము ఒంపులతో ఇలియానా యువత హృదయాల్లో కొలువైపోయింది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఇలియానా తీసుకున్న నిర్ణయాలే కెరీర్ కు శాపంలా మారాయి.

బాలీవుడ్ ని దున్నేయాలని బయలుదేరడంతో చుక్కెదురు తప్పలేదు. దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. ఇటీవల ఇలియానా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. పెళ్లి కాలేదు అప్పుడే గర్భం, పిల్లలు ఏంటి అంటూ అంతా షాక్ అయ్యారు.

చాలా రోజుల పాటు తన బిడ్డకు తండ్రి ఎవరనే విషయాన్ని కూడా ఇలియానా దాచిపెట్టింది. అయితే ఇటీవల అతడి ఫోటో షేర్ చేయడంలో ఇలియానా లైఫ్ పార్ట్నర్ డీటెయిల్స్ బయటకి వచ్చాయి. అతడి పేరు మైఖేల్ డోలాన్ అని తెలుస్తోంది. తాజాగా ఇలియానా తన ముద్దుల కొడుకు తో ఉన్న క్యూట్ ఫోటో షేర్ చేసింది. ఇలియానా తన కొడుక్కి కోవా ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. 

View post on Instagram

తన కొడుకు పుట్టి రెండు నెలలు గడుస్తున్న సందర్భంగా ఇలియానా ఈ క్యూట్ ఫోటో షేర్ చేసింది. అప్పుడే రెండు నెలలు గడచిపోయాయి అని కామెంట్ పెట్టింది. ఆగష్టు 1న ఇలియానా తన కొడుక్కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తల్లి కొడుకు ఇద్దరూ అందంగా ఉన్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.