Asianet News TeluguAsianet News Telugu

ఖైరతాబాద్ ఆర్డీఓ ఆఫీస్ లో అల్లు అర్జున్, ఎందుకొచ్చారో తెలుసా..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఖైరతాబాద్ లో సందడి చేశారు. అక్కడ ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్ళారు బన్నీ. ఇంతకీ ఆయన అక్కడికి ఎందుకు వెళ్లినట్టు. 

Icone Star Allu Arjun In Khairatabad RTO Office For International Driving License JMS
Author
First Published Mar 20, 2024, 5:03 PM IST

పుష్ప సినిమాతో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ ఇప్పటికే జాతీయా స్థాయిలో గుర్తింపుతో పాటు.. ఫ్యాన్స ను సాధించగా.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుకోసం పుష్ప2 తో రెడీ అవుతున్నాడు ఐకాన్ స్టార్. ఇక ఇంటర్నేషనల్ గా సందడి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు బన్నీ. అందులో భాగంగా రీసెంట్ గా ఖైరతాబాద్ ఆర్డీఓ ఆఫీస్ కు వచ్చాడు. అంతర్జాతీయ గుర్తింపుకు.. దీనికి సబంధం ఏంటీ అని  అనుకుంటున్నారా..? 

ఈ హీరో ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్‌లో కనిపించారు. డ్రైవింగ్ లైసెన్స్ పని మీద అక్కడికి వచ్చారు. అదేంటి ఇంత వరకూ ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా అని అనుమానం రావచ్చు.. అయితే ఆయన ఇక్కడి రోడ్లు మీద తిరగడానికి లైసెన్స్ తీసుకోవడం లేదు.. విదేశాల్లో తిరగడానికి లైసెన్స్ తీసుకుంటున్నాడు. విదేశీ రోడ్డులో చక్కర్లు కొట్టేందుకు అల్లు అర్జున్.. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేస్తున్నారు. ఇందుకోసమే ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కి వచ్చారు. 

 

రూల్స్ ప్రకారం లైసెన్స్ కోసం చేయవల్సిన ప్రోసిజర్ ని ఆఫీసర్స్ ని కనుకొని అల్లు అర్జున్ పూర్తి చేసారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అంతర్జాతీయ లైసెన్స్ తీసుకుని ఆయన ఏం చేయబోతున్నారు.. అనేది ఆసక్తి కరంగా మారింది. కొంపతీసి హాలీవుడ్ లో సెటిల్ అవుతారా ఏంటి అని కామెంట్లు వినిపిస్తున్నాయి. 

ఇక పుష్ప సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమాను ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈమూవీలో బన్నీ సరికొత్తగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మరి బన్నీ ఈసినిమాతో ఆస్కార్ ను టార్గెట్ చేయబడంతో పాటు వెయ్యి కోట్ల కలెక్షన్ మార్క్ దాటాలని అనుకుంటున్నాడట. మరి ఏం చేస్తాడో చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios