అల్లు అర్జున్ పుష్ప2 సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు బన్నీఫ్యాన్స్. ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఆతృతతో ఉన్నారు. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఏంటంటే.. బన్నీపుష్ప2 లో అల్ట్రా స్టైలీష్ లుక్ లో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ఆ లుక్ వైరల్ అవుతోంది.
స్టైల్ మెయింటేన్ చేయడంలో బాలీవుడ్ ను మించిపోయారు మన టాలీవుడ్ హీరోలు. సిక్స్ ప్యాక్స్ లో కాని.. హ్యాండ్సమ్ లుక్స్ లో కాని బీ టౌన్ స్టార్స్ మన హీరోల మీదకు ఏమాత్రం సరిపోరు అనే విధంగా తయారవుతున్నారు మన స్టార్స్. గతంలో బాలీవుడ్ హీరోలకు మాత్రమే సాధ్యం అని అనిపించుకున్న అన్ని పనులు.. మన స్టార్స్ వాళ్ళను మించి చేస్తున్నారు. చిన్న హీరోలు దగ్గర నుంచి టాలీవుడ్ స్టార్ హీరోల వరకూ.. లుక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ.. ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తున్నారు. ఈక్రమంలో అల్లు అర్జున్ అల్ట్రా స్టైలీష్ లుక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరో అల్లు అర్జున్. ఫస్ట్ మూవీ గంగోత్రి చూసి.. హీరోగా బన్నీ రాణిస్తాడా అని డౌట్ పడినవారికి ఇప్పుడు బన్నీని చూస్తే.. హాలీవుడ్ హీరోలు కూడా అల్లు అర్జున్ ముందు పనికిరారేమో అన్నంత స్టైలీష్ గా తయారయ్యాడు. సినిమా సినిమాకు లుక్స్ మార్చుకుంటూ..స్టైల్ చేంజ్ చేస్తూ.. తెలుగుతో పాటు మలయాళ మనసులను కూడా గెలుచుకున్నాడు బన్నీ. ఇక ఆరువాత పుష్ప సినిమాతో పాన్ ఇండియాను ఫిదా చేశాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్న2ను అంతుకు మించి తయారు చేస్తున్నాడు. ఇక తాజాగా, బన్నీ అల్ట్రా స్టైలిష్‌లో కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. రింగులు తిరిగిన లాంగ్ హేయిర్.. డిఫరెంట్ డ్రస్ లో బన్నీ చూడ ముచ్చటగా ఉన్నారు.
బన్నీ ఇలా స్టైలిష్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అల్లు అర్జున్ అంటే పడిచ్చిపోయే అభిమానులకు మాత్రం ఈ లుక్ చూసి పూనకాలు లోడింగ్ అని చెప్పాలి. ఇక ప్రస్తుతం బన్నీ స్టైలీష్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు అభిమానుల ఆశ ఏంటీ అంటే..? ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాలో నటిస్తున్నాడు కదా. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ ఈ గెటప్‌లో కనిపిస్తాడేమో అని ఆశపడుతున్నారు. నిజంగా ఇదే గెటప్ లో అల్లు కనిపిస్తే.. థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పుష్ప-2లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. పుష్ప సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన ఈహీరో.. పుప్ఫా2ను అంతకు మించి తెరకెక్కించి.. ఈసారి ఇంకా అదరగొట్టాలని ప్లన్ చేశాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు బన్నీ అండ్ టీమ్ రెడీ అవుతోంది. ఈ సినిమాను పుష్ప-1 కంటే కూడా ఎక్కువ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో బన్నీ మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. కాగా, ఈ సినిమాలో బన్నీ లుక్ ఎలా ఉండబోతుందా.. పుష్ప-1 స్టార్టింగ్‌లో ఊరమాస్‌గా ఉంటూ, క్లైమాక్స్ వచ్చేసరికి కాస్త స్టైలిష్‌గా మారిపోతాడు. ఇక ఆ లెక్కన చూసుకుంటే.. పుష్ప-2లో బన్నీ లుక్ పై రకరకాల ఊహాగానాలు ఊపు అందుకున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న లుక్ లోనే బన్నీ పుష్ప2లో కనిపిస్తాడు అని అంటున్నారు. ఇది నిజమైతే ఫ్యాన్స్ కు పండగే. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
