Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ కు యూఏఈ గోల్డెన్ వీసా.. టాలీవుడ్ హీరోల్లో ఫస్ట్ ఐకాన్ స్టార్ కే.. బన్నీ పోస్ట్ వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  (Allu Arjun) కు దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ గోల్డెన్ వీసా అందుకుని టాలీవుడ్ నుంచి ఫస్ట్ హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. దీనిపై ఆసక్తికరంగా స్పందించారు బన్నీ.
 

Icon star Allu Arjun got UAE Golden Visa!
Author
First Published Jan 20, 2023, 1:45 PM IST

‘పుష్ప’చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అదీగాక అంతర్జాతీయంగానూ ‘ఫుష్ప’తో బన్నీకి మంచి గుర్తింపు దక్కింది. గతేడాది ఇండిపెండెన్స్ లో వేడుకలో భారత్ నుంచి యూఎస్ఏలో ప్రతినిధ్యం వహించారు. ఇక తాజాగా దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి బన్నీకి గోల్డెన్ వీసా (Gloden Visa) అందింది. ఇదే విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 

ఈ సందర్భంగా దుబాయ్ లోని ఓ అధికారితో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నాడు. అదేవిధంగా దుబాయ్  సిటీ వ్యూ ఫొటోను కూడా షేర్ చేసి ఆసక్తికరంగా కామెంట్ చేశాడు. ‘మరోసారి అద్భుతమైన అనుభూతిని కలిగించిన దుబాయ్ కి ధన్యవాదాలు.  గోల్డెన్ వీసా ఇచ్చినందుకు థ్యాంక్యూ. త్వరలో మళ్లీ దుబాయ్ లో కలుసుకుందాం’ అని పేర్కొన్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టును వైరల్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి హీరోగానూ అల్లు అర్జున్ గుర్తింపు దక్కించుకున్నారు. 

సినిమా, స్పోర్ట్స్, సైన్స్ తదితర రంగాల్లో ప్రసిద్ధి పొందిన వ్యక్తులకు దుబాయ్ 2019 నుంచి గోల్డెన్ వీసాలను జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నార్త్, సౌత్ లో షారుఖ్ ఖాన్, దుల్కర్ సల్మాన్, త్రిష, కాజల్, ప్రణిత సుభాష్, మోహన్ లాల్, మమ్ముట్టి, అమలాపాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా ఈ గోల్డెన్ వీసాను కలిగి ఉంది. ఇక పుష్ప టీమ్ ప్రస్తుతం వైజాగ్ లో ల్యాండ్ అయ్యింది. పదిరోజుల పాటు అక్కడ చిత్రీకరణ కొనసాగనుంది. పుష్ప2ను మేకర్స్ మరింత గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. అల్లు అర్జున్ - రష్మిక మందన్న జంటగా నటిస్తన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రూపొందిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios