Asianet News TeluguAsianet News Telugu

ఎక్స్ పోజ్ చేయమని యాంకర్ పై ఒత్తిడి.. ఆమె ఏం చేసిందంటే?

సినిమాలలో హీరోయిన్లతో ఎక్స్ పోజ్ చేయిస్తూ ఆ విధంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి సొమ్ము చేసుకోవాలని చూసే మేకర్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే సినిమాలలో హీరోయిన్ల పాత్రలకు ప్రాముఖ్యనిస్తూ కథలను రాస్తున్నారు. 

I'm A Married Woman, What More You Want?
Author
Hyderabad, First Published Nov 19, 2018, 4:35 PM IST

సినిమాలలో హీరోయిన్లతో ఎక్స్ పోజ్ చేయిస్తూ ఆ విధంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి సొమ్ము చేసుకోవాలని చూసే మేకర్స్ చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే సినిమాలలో హీరోయిన్ల పాత్రలకు ప్రాముఖ్యనిస్తూ కథలను రాస్తున్నారు.

వెండితెరపై కనిపించే హీరోయిన్లు మాత్రమే కాదు.. బుల్లితెరపై కనిపించే యాంకర్లు, హోస్ట్ లు కూడా తమ స్పైసీ లుక్స్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రేష్మి, అనసూయ తమ హాట్ హాట్ అందాలతో బుల్లితెర ఆడియన్స్ ని తమ వైపు తిప్పుకున్తున్నారు. వీరి కోవలోనే చాలా మంది యాంకర్లు హాట్ గా కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు.

దీంతో షో నిర్వాహకులు కూడా అలానే ఆలోచిస్తున్నారు. తన నవ్వు, సెటైరికల్ పంచ్ లతో ఆడియన్స్ ను ఆకట్టుకునే ఓ యాంకర్ ని ఇటీవల ఓ షో నిర్వాహకులు కాస్త స్పైసీగా రెడీ అవ్వమని చెప్పారట. దీంతో ఆమె తన ఫిజిక్ కి తగ్గట్లు డ్రెస్ చేసుకొని కాస్త హాట్ గా కనిపించడానికి ప్రయత్నించిందట. అయినప్పటికీ షో నిర్వాహకులు మాత్రం ఇంకా హాట్ లుక్ ఉండాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారట.

దీంతో కోపం తెచ్చుకున్న సదరు యాంకర్ 'నాకు పెళ్లైంది.. నాకు సరైన బాడీ షేప్ లేదు.. నా నుండి మీరు హాట్ నేస ఎలా ఆశిస్తారు. నేను ఎంత చేయగలనో అంతా చేశాను. ఇక నా వల్ల కాదని' తేల్చి చెప్పిందట. దీంతో ఏం చేయలేక షో నిర్వాహకులు సైలెంట్ అయిపోయారట. కానీ తాము నిర్వహించే తదుపరి ఈవెంట్స్ లో మాత్రం ఆమెను తీసుకోకూడదని నిర్ణయించుకున్నారట.  
 

Follow Us:
Download App:
  • android
  • ios