Asianet News TeluguAsianet News Telugu

Alia Bhatt: పాపను కన్నందుకు నేనేమీ బాధపడటం లేదు... అలియా భట్ ఆసక్తికర కామెంట్స్ 

ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ అలియా భట్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కెరీర్ అయినా జీవితమైనా నేను నమ్మిందే చేస్తానంటూ కుండబద్దలు కొట్టారు. 

i dont think motherhood effects heroines career alia bhatt interesting comments
Author
First Published Jan 2, 2023, 11:56 AM IST


ఆర్ ఆర్ ఆర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు అలియా భట్. ఐతే అలియా పాత్రకు పెద్దగా నిడివి ఉండదు. కీలక సమయంలో కథను మలుపుతిప్పే సీతగా అలియా కనిపించారు. ఆమె స్టార్డం కి ఆ పాత్ర చాలా చిన్నది. రాజమౌళి ఆమెను బాగా నిరాశపరిచాడు. ఎడిటింగ్ లో ఆర్ ఆర్ ఆర్ చిత్ర సన్నివేశాల్లో చాలా భాగం లేపేశారు. ఆ క్రమంలో అలియా సన్నివేశాలు కట్ అయ్యాయి. తీరా సినిమా చూశాక అలియా ఫ్యాన్స్ నిరాశ చెందారు. అనంతరం ఎన్టీఆర్ 30 చిత్రానికి అలియా సైన్ చేసింది. వ్యక్తిగత కారణాలతో ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. 

2022 ఏప్రిల్ లో హీరో రన్బీర్ కపూర్ ని అలియా వివాహాం చేసుకున్నారు. రెండేళ్లకు పైగా డేటింగ్ చేసిన ఈ జంట పెళ్లి పీటలు ఎక్కారు. బ్రహ్మాస్త్ర షూటింగ్ సెట్స్ లో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్ళైన ఏడు నెలలకే అలియా పాపకు జన్మనిచ్చింది. పెళ్ళికి ముందే చట్టపట్టాసుకుని తిరిగిన ఫలితమే అది. అలియా గర్భవతి అయ్యారని తెలిసే పెళ్ళికి ముహూర్తం పెట్టారు కాబోలు. ఇక వారి కాంబోలో విడుదలైన బ్రహ్మాస్త్ర మిక్స్డ్ టాక్ అందుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా పూర్తి స్థాయిలో సత్తా చాటలేదు. అయితే మిగతా బాలీవుడ్ చిత్రాలతో పోల్చితే బెటర్ అనిపించింది. 

ఇదిలా ఉంటే అలియా కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తప్పు ఒప్పు అనేది ఏమీ ఉండదు. నాకు మంచి అనిపించింది ఇతరులకు చెడు కావచ్చు. కాబట్టి కెరీర్ పరంగా అయినా వ్యక్తిగత విషయమైనా నా మనసుకు నచ్చిందే చేస్తాను. నమ్ముతాను. హీరోయిన్ గా కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు రన్బీర్ ని వివాహం చేసుకొని తల్లి అయ్యాను. పెళ్లి చేసుకోవడం, తల్లి కావడం కెరీర్ ని దెబ్బతీస్తాయని ఎవరు చెప్పారు? ఒక వేళ అలా జరిగినా పర్లేదు. నా టైం బాలేదు అనుకుంటాను. 

అంతే కానీ కెరీర్ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు పాపను కన్నందుకు బాధపడను. జీవితంలో తల్లి కావడం కంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఏది జరిగినా, ఎలాంటి మార్పు వచ్చినా దాన్ని సహజంగా తీసుకుంటాను... అని చెప్పుకొచ్చారు. తల్లైన అలియా భట్ కి ఇక ఆఫర్స్ రావు, ఆమె కెరీర్ క్లోజ్ అని విమర్శించే వాళ్లకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios