ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రెగ్యూలర్‌గా సమంత ఇలా కొటేషన్లని, తన ఇన్‌స్పైరింగ్‌ వర్డ్స్ ని పంచుకుంటుంది. దీంతోపాటు లేటెస్ట్ మరో విషయాన్ని వెల్లడించింది. తన మాటల్లో ఫిల్టర్‌ ఉందని తెలిపింది. తాను మాట్లాడేముందు ఏం ఆలోచించనని తెలిపింది.

సమంత(Samantha) కెరీర్‌ పరంగా రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది. విడాకుల తర్వాత సమంతో ఊహించని మార్పులు చోటు చేసుకుంది. స్వేచ్ఛగాలులు పీల్చుతుంది. తనకు నచ్చినట్టుగా జీవిస్తుంది. వ్యక్తిగత జీవితాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తుంది. వెకేషన్‌లో హాలీడేస్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే తన జీవితాన్ని తాను ఆస్వాధిస్తుందని చెప్పొచ్చు. అయితే ఇటీవల కెరీర్‌ ని సైతం పరుగులు పెట్టిస్తున్న ఈ భామ.. యువతరానికి పలు ఇన్స్పైరింగ్‌ వర్డ్స్ చెబుతుంది. 

పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ గురించి అభిమానులతో పంచుకుంటూ ఇన్‌స్పైర్‌ చేస్తుంది Samantha. అందులో భాగంగా సమంత క్రమ శిక్షణ గురించి చెప్పింది. జీవితంలో ఎదగాలంటే క్రమ శిక్షణ ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపింది. క్రమ శిక్షణ మన్నలి బలంగా తయారు చేస్తుందని, కానీ క్రమశిక్షణ ఎంత ముఖ్యమనేది ఎవరూ గట్టిగా చెప్పలేరని పేర్కొంది. సిస్టమాటిక్‌గా ఉండటం వల్ల తాత్కాలిక ఆనందాలను కోల్పోవచ్చు. కానీ మున్ముందు మంచి ఫలితాలను పొందుతామని వెల్లడించింది. 

సిస్టమాటిక్‌గా ఉండటం వల్లే భవిష్యత్‌లో మనకు మంచి ఫలితాలు అందుతాయని, జీవితంలోఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇదొక పునాది అని, మీరు కోరుకున్నవి మీకు దక్కేంతగా మిమ్మల్ని మీరు ప్రేమించడం కూడా తప్పనిసరి అని, ఇది నిజమని పేర్కొంది సమంత. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో రెగ్యూలర్‌గా సమంత ఇలా కొటేషన్లని, తన ఇన్‌స్పైరింగ్‌ వర్డ్స్ ని పంచుకుంటుంది. దీంతోపాటు లేటెస్ట్ మరో విషయాన్ని వెల్లడించింది. 

తన మాటల్లో ఫిల్టర్‌ ఉందని తెలిపింది. తాను మాట్లాడేముందు ఏం ఆలోచించనని తెలిపింది. కానీ నా మాటలు మాత్రం అంతిమంగా సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయని చెప్పింది. లోపల ఒకటి, బయటకు ఒకటి చెప్పడం తనకు చేతకాదనే విషయాన్ని సమంత స్పష్టం చేసింది. అదే సమయంలో ఏదైనా తాను ముక్కుసూటిగానే చెప్పేస్తాననే విషయాన్ని ఆమె వెల్లడించింది. 

సమంత.. నాలుగేండ్ల దాంపత్య జీవితం అనంతరం నాగచైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌ 2న నాగచైతన్య, సమంత సంయుక్త ప్రకటన ద్వారా నాలుగేండ్ల మ్యారేజ్‌ లైఫ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. విడిపోవడానికి కారణాలు చెప్పలేదుగానీ, విడిపోయినా స్నేహితులుగానేఉంటామని వెల్లడించారు. అయితే దీనిపై నాగచైతన్య ఇటీవల స్పందిస్తూ, ఇద్దరం అనుకునే విడిపోయామని, ఈ విషయంలో ఇద్దరం హ్యాపీ అని చెప్పదం దుమారం రేపింది. డైవర్స్ ప్రభావం పెద్దగా లేదని, తన ఫ్యామిలీ సపోర్టివ్‌గా ఉందని చెప్పాడు నాగచైతన్య. 

ప్రస్తుతం సమంత కెరీర్‌ పరంగా ఫుల్‌ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. ఇందులో శకుంతలగా కనిపించబోతుంది. మరోవైపు తమిళంలో `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రంలో నయనతార, విజయ్‌ సేతుపతిలతో కలిసి నటిస్తుంది. ఇంకా `యశోద` అనే పాన్‌ ఇండియాసినిమా చేస్తుంది. దీంతోపాటు డ్రీమ్‌వారియర్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తుంది. కార్తీ హీరోగా నటించే అవకాశం ఉంది. ఇంకోవైపు ఓ అంతర్జాతీయ ప్రాజెక్ట్ లో, అలాగే హిందీలో ఓ సినిమా చేస్తుందని టాక్‌. 

View post on Instagram