Asianet News TeluguAsianet News Telugu

'జబర్దస్త్' బాబాయ్ డాన్స్ కి భారీ డిమాండ్!

'జబర్దస్త్' షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న చాలా మంది కమెడియన్స్ కి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. వారిలో గెటప్ శీను కూడా ఉన్నాడు. కానీ సినిమాల కంటే టెలివిజన్ లోనే అతడి మంచి ఫాలోయింగ్ ఉంది. 

Huge Demand For Jabardasth 'Baabai' Dance
Author
Hyderabad, First Published Dec 29, 2018, 12:58 PM IST

'జబర్దస్త్' షో ద్వారా పాపులారిటీ దక్కించుకున్న చాలా మంది కమెడియన్స్ కి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. వారిలో గెటప్ శీను కూడా ఉన్నాడు. కానీ సినిమాల కంటే టెలివిజన్ లోనే అతడి మంచి ఫాలోయింగ్ ఉంది.

సుడిగాలి సుదీర్ టీమ్ లో ఒకరిగా ఉంటోన్న గెటప్ శీను.. రకరకాల గెటప్పులు వేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన వేసిన గెటప్ అందరినీ ఆకట్టుకుంది. అదేంటంటే.. 'బిల్డప్ బాబాయ్'.  ఈ స్కిట్ మాములుగా హిట్ అవ్వలేదు. యూట్యూబ్ లో బోలెడన్ని హిట్స్ వచ్చి పడ్డాయి.

ముఖ్యంగా ఈ స్కిట్ లో గెటప్ శీను రీమిక్స్ సాంగ్ కి విపరీతమైన ప్రేక్షకాదరణ పెరిగింది. అందరూ ఈ పాటను డబ్ స్మాష్ లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.  గెటప్ శీను కూడా ఈ రీమిక్స్ సాంగ్ ని పలు సందర్భాల్లో స్టేజ్ ల మీద ప్రదర్శించాడు.

ఇప్పుడు ఎన్నారై అసోసియేషన్స్ అమెరికా, లండన్ వంటి దేశాల్లో అదే పాట కోసం గెటప్ శీనుతో షోలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ షోల కోసం గెటప్ శీను భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. వచ్చే ఏడాదిలో కూడా ఈ పాటకు కొన్ని చోట్లపెర్ఫార్మన్స్ ఇవ్వనున్నాడు. మొత్తానికి ఈ రీమిక్స్ సాంగ్ డిమాండ్ మాములుగా లేదుగా! 

Follow Us:
Download App:
  • android
  • ios