Asianet News TeluguAsianet News Telugu

కౌశల్ కి సపోర్ట్ చేస్తూ అమ్మాయిల డాన్సులు!

బిగ్ బాస్ సీజన్ 2లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కౌశల్ కి ప్రజల్లో ఎంతగా ఫాలోయింగ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కోసం సోషల్ మీడియాలో ఆర్మీ కూడా తయారైంది. ఇక కౌశల్ ని సపోర్ట్ చేస్తూ హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ర్యాలీ కూడా నిర్వహించారు. 

huge craxe for bigg boss contestant kaushal
Author
Hyderabad, First Published Sep 21, 2018, 2:16 PM IST

బిగ్ బాస్ సీజన్ 2లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కౌశల్ కి ప్రజల్లో ఎంతగా ఫాలోయింగ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కోసం సోషల్ మీడియాలో ఆర్మీ కూడా తయారైంది. ఇక కౌశల్ ని సపోర్ట్ చేస్తూ హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ర్యాలీ కూడా నిర్వహించారు.

వీలైనంతగా కౌశల్ కి మద్దతు తెలుపుతూ అతడిని విన్నర్ చేయాలని కౌశల్ ఆర్మీ ప్లాన్. అయితే కౌశల్ పై ఉన్న అభిమానం పీక్స్ కి చేరిందని, ఆయనలో బ్యాడ్ పార్ట్ బయట పడుతున్నా.. పిచ్చిగా అభిమానిస్తున్నారంటూ హేళన చేసేవారు కూడా లేకపోలేదు.

అయినా.. కౌశల్ ఆర్మీ అటువంటి కామెంట్స్ పట్టించుకోకుండా..  ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ కాలేజ్ పార్టీలో కూడా స్టూడెంట్స్ అందరూ కౌశల్ కి మద్దతు తెలుపుతూ స్క్రీన్ మీద ఆయన ఫోటోలు పాటలు ప్లే అవుతుండగా అమ్మాయిలందరూ డాన్స్ చేస్తూ కనిపించారు. దీన్ని చాలా గొప్పగా కౌశల్ ఆర్మీ సభ్యులు సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేస్తున్నారు. కౌశల్ క్రేజ్ ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  

"

 

 

Follow Us:
Download App:
  • android
  • ios