పాపులర్ టీవీ యాంకర్ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తోందని టాక్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవడం కోసం సదరు యాంకర్ బాగానే ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

బుల్లితెర కామెడీ షోతో బాగా పాపులర్ అయిన ఈ భామ సినిమాల్లో కూడా తన సత్తా చాటుతోంది. ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా వెళ్లాలని ప్లాన్ చేస్తోంది. ఓ సీనియర్ పొలిటీషియన్ సహాయం కూడా తీసుకుంటుందట.

వైఎస్సార్ సీపీ పార్టీ ఎమ్మెల్యేగా సేవలు నిర్వహిస్తోన్న సీనియర్ నటితో ఈ హాట్ యాంకర్ మంతనాలు సాగిస్తోందట. అయితే ఈసారి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించినా.. లాభం లేదని కొందరు అంటున్నారు.

వైఎస్సార్ సీపీ పార్టీ తరఫున పోటీ చేయాలనే ఈ హాట్ యాంకర్ కల నెరవేరడం కష్టమని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!