Asianet News TeluguAsianet News Telugu

ఓటిటిలో విడుదల కానున్న హారర్ థ్రిల్లర్ 'లీల'!

'లీల' ధియేటర్స్ లో విడుదలకు ముందే 'ఊర్వశి ఓటిటి' ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం ఈనెల 14న "ఊర్వశి ఓటిటి" ద్వారా విడుదల కానుంది.

horror thriller leel all set to release in ott ksr
Author
Hyderabad, First Published Jan 15, 2021, 1:40 PM IST


రాయల్ మూవీ క్రియేషన్స్ పతాకంపై బాల దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ గా ఏ.ఎం.భాషా నిర్మించిన 'లీల' ధియేటర్స్ లో విడుదలకు ముందే 'ఊర్వశి ఓటిటి' ద్వారా ప్రేక్షకులను అలరించనుంది. 
     

ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన స్నేహా గణేష్... "లీల" చిత్రం తనకు మంచి గుర్తింపునిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. 'లీల'లో నటించే అవకాశం రావడం దైవలీల'గా పేర్కొంది. ఈ చిత్రంలో తాను హీరోయిన్ మాత్రమే కాదని... సినిమాలోనూ సినిమా హీరోయిన్ గా నటించడం భలే గమ్మత్తుగా అనిపించిందని చెప్పింది. 

ఈ చిత్రం ఈనెల 14న "ఊర్వశి ఓటిటి" ద్వారా విడుదల కానుంది. విజయ్, స్నేహ గిరీష్, సంధ్య  ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ దాసరి, ఎడిటింగ్: ఎం.ఎన్.ఆర్, సంగీతం: శ్రీమిత్ర, నిర్మాత: ఏ.ఎం.భాషా, రచన-దర్శకత్వం: బాల

Follow Us:
Download App:
  • android
  • ios