కుర్ర హీరోతో ఐటం సాంగ్ కమిటైన కసక్కుపాప ?
ఈ సాంగ్ సినిమాకే స్పెషల్ గా ఉంటుందని, ఆమె ఆ పాటలో తన అందాలతో కను విందు చేస్తూ, స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఈ పాట పూర్తై బయిటకు వస్తే చాలు ..

నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించిన తర్వాత ఒక్కసారిగా హనీ రోజ్ కు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అంతకుముందు తెలుగులో అంతకు ముందు అనేక చిత్రాలలో నటించినప్పటికీ ఫేమస్ కాలేకపోయింది.కానీ వీర సింహారెడ్డి చిత్రంలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ అనే పాటతో కుర్రాళ్లతో చిందులేయించిన హనీరోజ్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఈ చిత్రంలో అందాలు ఆరబోస్తూ ఆమె చేసిన స్టెప్స్ కు పిచ్చెక్కిపోయారు . ఈ పాట ఓటిటిలో కూడా ఒకటికి రెండు సార్లు చూసి సూపర్ హిట్ చేసేసారు. ఈ ఒక్క పాటతో హనీ రోజ్ తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.ఇటు ఇండస్ట్రీలోనూ అటు ప్రేక్షకులలోను ఇప్పుడు ఆమెకి మంచి క్రేజీ ఫాలోయింగ్ ఏర్పడింది.
ఆ తర్వాత ఆమె ఐటం సాంగ్స్, పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో బిజీ అయ్యిపోయింది. ఇప్పుడు ఆమె ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలో ఓ ఐటం సాంగ్ చేయటానికి కమిటైందని సమాచారం. ఈ సాంగ్ సినిమాకే స్పెషల్ గా ఉంటుందని, ఆమె ఆ పాటలో తన అందాలతో కను విందు చేస్తూ, స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఈ పాట పూర్తై బయిటకు వస్తే చాలు .. హనీ రోజ్ కి క్రేజ్ విపరీతంగా పెరిగిందని అంటున్నారు. అయితే ఆమె ఇంకా సైన్ చేయలేదని, రేటు దగ్గర బేరాలు సాగుతున్నాయని అంటున్నారు. ఆమె నో చెప్తే వెంటనే నోరా ఫతేహి ని సీన్ లోకి తెస్తారట. ఏదైమైనా ఈ ఇద్దరూ గ్లామరస్ డాన్సర్స్ లో ఒకరు తన స్టెప్పులతో కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేయటానికి సిద్దపడుతున్నారు.
ఇక మాస్ కా దాస్ విశ్వక్‍సేన్, నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రూపొందుతోంది. యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఓ పాట రిలీజ్ కాగా.. మంచి పాపులర్ అయింది. విశ్వక్ మాస్ లుక్‍లో ఉండటంతో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంపై మంచి హైప్ ఉంది. కాగా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ గురించి మరోసారి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిసెంబర్ 8వ తేదీనే రిలీజ్ అవుతుందని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ స్పష్టం చేసింది.
గోదావరి బ్యాక్‍డ్రాప్‍లో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ‘సుట్టంలా సూసి’ అంటూ ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఆకట్టుకుంది. మెలోడియస్‍గా ఉంది.