Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ పాట.. హాలీవుడ్ సింగర్ డాన్స్.. అదిరిపోయిందిగా.. వైరల్ అవుతున్న వీడియో..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా బన్నీని ఫాలో  అయ్యేవారు ఉన్నారు. అందులో సామాన్యు ల నుంచి సెలబ్రిటీల వరకూ.. బన్నీ మ్యానరిజం, ఆయన సాంగ్స్ తో రీల్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో హాలీవుడ్ సెలబ్రిటీ బన్నీ పాటకుచిందేశాడు. 

Hollywood Pop Singer Ed Sheeran Dance with Tollywood Icon Star Allu Arjun Butta Bomma Song JMS
Author
First Published Mar 13, 2024, 5:31 PM IST

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రపంచ వ్యాప్తంగా ఇమేజ్ ను సాధించాడు. మరీ ముఖ్యంగా బన్నీ... అల వైకుంఠపురములో సినిమాతో పాటు పుష్ప సినిమాతో పాన్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఈసినిమాల్లో బన్నీ మ్యానరిజంతో పాటు.. సినిమాల్లోని సాంగ్స్ వరల్డ్ వైడ్ గా ఎంతో రీచ్ ని సంపాదించుకున్నాయి. పుష్పతో బన్నీ ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలసిదే.. అలాగే అందకు ముందు వచ్చిన అలా వైకుంఠపురములో సినిమాతో ఇంకా పాపులర్ అవుతున్నాడు ఐకాన్ స్టార్. ముక్యంగా ఈసినిమాలో బుట్టబొమ్మ సాంగ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో రీచ్ ని సంపాదించుకుంది. 

ఇక తాజాగా ఈ పాటకు  ఓ హాలీవుడ్ పాప్ సింగర్ స్టెప్ వేసి ఆకట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.బుట్టబొమ్మ సాంగ్ ని పాడిన సింగర్ అర్మాన్ మాలిక్ తో కలిసి హాలీవుడ్ సింగర్ ఎడ్ షీరన్’ డాన్స్ వేసిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది.  ఈ వీడియోతో మరోసారి బుట్టబొమ్మ సాంగ్ టైం లైన్ లోకి వచ్చింది. 

 

ఈ పాట వరల్డ్ వైడ్ గా ఇంతటి ఫేమస్ అవ్వడానికి ముఖ్య కారణం ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ సాంగ్ లోని హుక్ స్టెప్ ని వార్నర్ ఓ రేంజ్ లో ప్రమోట్ చేసారు.ఇంటర్నేషనల్ మ్యాచ్స్ మధ్యలో పిచ్ పైనే ఈ స్టెప్ ని వేసి వార్నర్ ఆకట్టుకుంటూ వచ్చారు. ఇప్పటికి కూడా వార్నర్ కనిపిస్తే చాలామందికి ఇదే స్టెప్ ముందుగా గుర్తుకు వస్తుంది. అందుకనే ఆ సినిమా రిలీజయ్యి నాలుగేళ్లు అవుతున్నా.. ఇంకా ఆ పాట, ఆ స్టెప్ ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంది. 

అంతే కాదు ఈపాట తరువాత  వచ్చిన  పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్ కూడా ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది. ఆ పాటలో చెప్పు వదిలేసి అల్లు అర్జును వేసిన  స్టెప్ అందరిని ఆకట్టుకోండంతో పాటు.. భారీగా క్రేజ్ ను కూడా సాధించింది. అయితే ఇక్కడ చెప్పుకో దగ్గ విశేషం ఏంటంటే.. ఈ రెండు పాటలకి డాన్స్ కోరియోగ్రఫీ చేసింది జానీ మాస్టర్. రెండు పాటలోని స్టెప్స్ చాలా సింపుల్ అండ్ గ్రేస్ ఉండడంతో ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios