ఈ కేసులోకి సీబీఐ ఎంటరవడంతో వేగం పుంజుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు అనేక మలుపులు తీసుకుంటోంది. ఆయనది ఆత్మహత్యనా? హత్యనా? అన్నది పెద్ద మిస్టరీగా మారింది. వంట మనిషి ఆత్మహత్యే చేసుకున్నాడని అంటున్నారు. కానీ బీజేపీ నాయకులు ఆయనది హత్య అని అంటున్నారు. దీంతో ఇది పెద్ద మిస్టరీగా మారింది. అయితే సుశాంత్ కేసులో సీబీఐ విచారణ చేపడుతుంది.
ఇదిలా ఉంటే ఈ కేసులోకి సీబీఐ ఎంటరవడంతో వేగం పుంజుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్ట్ కి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. సుశాంత్‌ని సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించిందని ఆమెపై ఆరోపణలున్నాయి. మరోవైపు సుశాంత్ నుంచి రూ.15కోట్లు ఆమె కొట్టేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ఈడీ అధికారులు ఆమెని విచారించారు. దీంతో ఆమెని పోలీసులు అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే దీనిపై రియా లాయర్ స్పందించారు. సీబీఐ నుంచి తమకు అరెస్ట్ కి సంబంధించి ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు. నోటిసులు వస్తే విచారణకు హాజరయ్యేందుకు రియా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మరోవైపు సుశాంత్ తండ్రి తరపు లాయర్ వికాస్ సింగ్ స్పందిస్తూ, రియా చక్రవర్తికి త్వరలో సీబీఐ నోటీసులు ఇవ్వనుందని, ఆమె విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య చేసుకునేందుకు ఉన్న అవకాశాలపై విచారణ జరుపుతుంది.
