Asianet News TeluguAsianet News Telugu

హీరోయిన్ శ్రియ శరన్ పెళ్లి రోజు... ఆ ఫోటోలు బయటపెట్టిన స్టార్ లేడీ!


హీరోయిన్ శ్రియ శరన్ పెళ్లి రోజు నేడు. ఈ శుభ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేశారు. 
 

heroine shriya saran shares marriage photo as today her marriage anniversary
Author
First Published Mar 19, 2023, 2:08 PM IST

ఢిల్లీ బ్యూటీ శ్రియ శరన్ దశాబ్దానికి పైగా టాప్ హీరోయిన్ గా ఉన్నారు. ప్రస్తుతం స్టార్ హోదా పోయింది. నటిగా మాత్రం బిజీ.  'ఇష్టం' మూవీతో హీరోయిన్ గా మారిన శ్రియ శరన్, సంతోషం, చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే చిత్రాలతో వరుస విజయాలు దక్కించుకున్నారు. అనతికాలంలో టాప్ పొజిషన్ కి వెళ్లారు. అరంగేట్రం నుండి ఆమెకు తిరుగులేకుండా పోయింది. అందానికి తోడు శ్రియ టాలెంటెడ్. ఆమె ప్రొఫెషనల్ డాన్సర్. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ కలిగిన నటి. స్టార్ గా డిమోట్ అయ్యాక శ్రియ శరన్ పెళ్లి ఆలోచన చేశారు. 

రష్యాకు చెందిన ఆండ్రీ కోషీవ్ ని శ్రియ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆండ్రీ బిజినెస్ మాన్. చాలా కాలం డేటింగ్ చేసిన ఈ జంట 2018 మార్చి 19న ముంబైలో వివాహం చేసుకున్నారు. శ్రియ-ఆండ్రీ పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. నేడు పెళ్లి రోజు కావడంతో శ్రియ శరన్ ఇంస్టాగ్రామ్ లో తన ఆనందం అభిమానులతో పంచుకున్నారు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ఆండ్రీ... అంటూ కామెంట్ చేశారు. 

శ్రియ తన పెళ్లి ఫోటోలు ఈ సందర్భంగా బయటపెట్టారు. శ్రియ 2020లో ఒక పాపకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచారు. అది లాక్ డౌన్ సమయం కావడంతో శ్రియ గర్భం దాల్చిన విషయం బయటకు రాలేదు. ఆమె గర్భవతి కావడం, పాపను కనడం ఎవరికీ తెలియకుండా జరిగిపోయాయి. అనంతరం ఈ విషయాన్ని శ్రియ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దాంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రియ కూతురు పేరు రాధ. 

కొన్ని రకాల అవమానాలకు భయపడి తల్లైన విషయం దాచినట్లు ఇటీవల శ్రియ వివరణ ఇచ్చారు. ఇక శ్రియ కెరీర్ పరిశీలిస్తే... స్టార్ హీరోలు పక్కన పెట్టినప్పట్టికీ ఏదో ఒక రూపంలో ఆమె ఛాన్సులు వస్తున్నాయి. గత ఏడాది ఆర్ ఆర్ ఆర్, దృశ్యం 2(హిందీ), తడ్కా చిత్రాల్లో నటించారు. ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ కబ్జ విడుదలైంది. ఉపేంద్ర హీరోగా నటించారు. కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ సైతం కీలక రోల్స్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios