Asianet News TeluguAsianet News Telugu

బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర.. స్పందించిన అలియా భట్..! 

బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర ట్రెండ్ కొనసాగుతుంది. ఈ నెగిటివ్ వైబ్స్ మేకర్స్ ని భయపెడుతున్నాయి. కాగా బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర పరిస్థితులపై హీరోయిన్ అలియా భట్ స్పందించారు.

heroine responds over boycott brahmastra trends
Author
First Published Sep 8, 2022, 2:18 PM IST

బ్రహ్మాస్త్ర మూవీ వరల్డ్ వైడ్ సెప్టెంబర్ 9న విడుదల అవుతుంది. కరణ్ జోహార్ దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో బ్రహ్మాస్త్ర నిర్మించారు. రన్బీర్ కపూర్, అలియా భట్ కాంబినేషన్ లో అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో విజువల్ వండర్ గా రూపొందించారు. నాగార్జున, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, మౌని రాయ్ ఇతర కీలక రోల్స్ చేశారు. తెలుగులో బ్రహ్మాస్త్రం టైటిల్ తో విడుదల చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర ఐదు భాషల్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. 

విడుదల దగ్గర పడుతుండగా ప్రమోషన్స్ గట్టిగా నిర్వహిస్తున్నారు. మరికొన్ని గంటల్లో బ్రహ్మాస్త్ర వెండితెరపై ప్రదర్శితం కానుంది. కాగా మూవీ బ్రహ్మాస్త్రపై సోషల్ మీడియాలో భారీగా నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్ రివేంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నారు. గత వారం రోజులుగా బాయ్ కాట్ బ్రహ్మస్త్ర హ్యాష్ టాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ బాయ్ కాట్ ట్రెండ్ కి ఇటీవల భారీ చిత్రాలు బలయ్యాయి. లాల్ సింగ్ చడ్డా, లైగర్ తో పాటు అక్షయ్ కుమార్, తాప్సి చిత్రాలను బాయ్ కాట్ చేయాలని నెటిజెన్స్ ట్రెండ్ చేశారు. 

నిజంగానే ప్రేక్షకులు సదరు చిత్రాలను బాయ్ కాట్ చేశారు. అవి అతి పెద్ద డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. బ్రహ్మాస్త్ర చిత్రంపై మరింతగా నెటిజెన్స్ ద్వేషం ప్రదర్శిస్తున్నారు. సుశాంత్ సింగ్ మరణానికి పరోక్షంగా కారణమైన వారిపై రివేంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. బాయ్ కాట్ బ్రహ్మాస్త్ర అని ట్రెండ్ చేస్తున్నారు. కాగా ఈ బాయ్ కాట్ ట్రెండ్ పై హీరోయిన్ అలియా భట్ మాట్లాడారు .  సినిమాపై అసలు ఎలాంటి నెగిటివిటీ ఆమె అన్నారు. అంతా పాజిటివ్ గానే ఉంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బాయ్ కాట్ గురించి ఆలోచించడం లేదన్నారు. 

అలియా సహనంగా, సామరస్యంగా మాట్లాడి ఆ టాపిక్ నుండి బయటపడింది. అలా కాకుండా ఏమాత్రం టెక్కు ప్రదర్శించినా మొదటికే మోసం వస్తుంది. పొగరుతో కూడిన కరీనా కపూర్, విజయ్ దేవరకొండ కామెంట్స్ లాల్ సింగ్ చడ్డా, లైగర్ చిత్రాల వసూళ్లు తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ అనుభవంతో అలియా భట్ ఆచితూచి మాట్లాడారు. ఈ చిత్ర అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. అయినప్పటికీ బాయ్ కాట్ ట్రెండ్ కరణ్ జోహార్ కంటికి కునుకు లేకుండా చేస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios