Asianet News TeluguAsianet News Telugu

ప్రతి వీకెండ్ రష్మిక మందాన అది చేయకుండా ఉండలేదా... ఇదేం అలవాటు!


నటిగా రష్మిక మందాన ఫుల్ బిజీ. తీరిక లేని షెడ్యూల్స్ నుండి ఉపశమనం పొందేందుకు రష్మిక మందాన ప్రతి వీకెండ్ ఓ పని చేస్తుందట. ఆ వివరాలు ఏమిటో చూద్దాం... 
 

heroine rashmika mandanna plans every weekend like this ksr
Author
First Published Apr 1, 2024, 11:18 AM IST

హీరోయిన్ రష్మిక మందాన కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె లేటెస్ట్ మూవీ యానిమల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రన్బీర్ కపూర్ హీరోగా యానిమల్ తెరకెక్కింది. యానిమల్ చిత్ర కంటెంట్ పై విమర్శలు వినిపించినా ప్రేక్షకులు మాత్రం ఆదరించారు. వరల్డ్ వైడ్ యానిమల్ మూవీ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రష్మిక చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప 2. బ్లాక్ బస్టర్ పుష్ప కు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. 

అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో  రూపొందుతున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. శ్రీవల్లి పాత్రలో రష్మిక మరోసారి సందడి చేయనుంది. అలాగే రైన్ బో, గర్ల్ ఫ్రెండ్ టైటిల్స్ తో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో రష్మిక మందాన నటిస్తుంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందాన వీకెండ్ మాత్రం చక్కగా ప్లాన్ చేసుకుంటుందట. ప్రతి వీకెండ్ ఫ్రెండ్స్ తో గడపడం రష్మికకు ఇష్టమైన వ్యాపకం అట. వాళ్ళను కలవకుండా ఉండలేదట. 

ఫ్యామిలీకి కొంత సమయం కేటాయించినప్పటికీ ఎక్కువగా మిత్రులతో ఆహ్లాదంగా గడిపేందుకు ఆసక్తి చూపుతుందట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరోవైపు రష్మిక మందాన పై ఎఫైర్ రూమర్స్ తరచుగా వినిపిస్తున్నాయి. హీరో విజయ్ దేవరకొండతో ఆమె రిలేషన్ లో ఉన్నారనే వాదన ఉంది. పలుమార్లు విజయ్-రష్మిక ఏకాంతంగా కెమెరా కంటికి చిక్కారు. మాల్దీవ్స్ కి వెకేషన్ కి వెళ్లారు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడం విశేషం. అయితే ఆ అమ్మాయి మా పేరెంట్స్ కి కూడా నచ్చాలి అన్నాడు. విజయ్ దేవరకొండ ప్రేమ వివాహం చేసుకోనున్న ఆ అమ్మాయి రష్మిక మందాననే అంటున్నారు. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ చూసిన రష్మిక మందాన సినిమా సూపర్ హిట్ అని అంచనా వేసింది. పార్టీ కావాలంటూ విజయ్ దేవరకొండను సోషల్ మీడియా వేదికగా కోరింది... 
 

Follow Us:
Download App:
  • android
  • ios