Asianet News TeluguAsianet News Telugu

డార్లింగ్...  పార్టీ కావాలన్న రష్మిక, విజయ్ దేవరకొండ రిప్లై ఏంటో తెలుసా?

హీరో విజయ్ దేవరకొండను పార్టీ అడిగింది రష్మిక మందాన. వెంటనే స్పందించిన విజయ్ దేవరకొండ ఆమెకు రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి సోషల్ మీడియా పోస్ట్స్ వైరల్ అవుతున్నాయి. 
 

heroine rashmika madanna wants a treat from hero vijay devarakonda this is his reply ksr
Author
First Published Mar 29, 2024, 1:12 PM IST

విజయ్ దేవరకొండ-రష్మిక మందాన మధ్య సంథింగ్ సంథింగ్ అనేది కొన్నాళ్లుగా నడుస్తున్న టాక్. మీడియాలో పలుమార్లు వీరి ఎఫైర్ పై కథనాలు వెలువడ్డాయి. హైదరాబాద్ వస్తే రష్మిక ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఇంటికి వెళుతుంది. ఆ ఇంట్లో జరిగే ప్రతి చిన్న వేడుకకు రష్మిక మందాన హాజరవుతుంది. ఒకటి రెండుసార్లు ఏకాంతంగా మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ దేవరకొండ-రష్మిక డేటింగ్ చేస్తున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. 

ఈ వార్తలపై విజయ్ దేవరకొండ, రష్మిక స్పందించారు. అవన్నీ ఊహాగానాలు మాత్రమే అని కొట్టిపారేశారు. రూమర్స్ నేపథ్యంలో రష్మిక మందాన, విజయ్ దేవరకొండ సోషల్ మీడియా పోస్ట్స్ నెటిజెన్స్ ని ఆకర్షించాయి. విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ మార్చి 28న విడుదలైంది. ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసిన రష్మిక మందాన టీమ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసింది. 

'మై డార్లింగ్స్ విజయ్ దేవరకొండ, పరశురామ్ కు నా బెస్ట్ విషెస్. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్  విడుదల అవుతుంది. చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను.  మీరు ఖచ్చితంగా హిట్ కొడుతున్నారు. నాకు పార్టీ ఇవ్వాలి. ఆల్ ది బెస్ట్ మై లవ్ మృణాల్ ఠాకూర్..' అని ఎక్స్ లో కామెంట్ పోస్ట్ చేసింది. దీనికి స్పందించిన విజయ్ దేవరకొండ కామెంట్ పెట్టాడు. రష్మిక పోస్ట్ ని కోట్ చేస్తూ... 'క్యూటెస్ట్', అని కామెంట్ పెట్టాడు. వీరిద్దరి సోషల్ మీడియా సంభాషణ వైరల్ గా మారింది. 

ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న విడుదల అవుతుండగా... మీరు హిట్ కొట్టేసినట్లే, పార్టీ ఇవ్వాలని రష్మిక మందాన విజయ్ దేవరకొండను కోరింది.  దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కాగా... విజయ్ దేవరకొండ, రష్మిక మందానకు స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. గీత గోవిందం అనంతరం రష్మిక మందానకు వరుస ఆఫర్స్ వచ్చాయి. ఆమె స్టార్ హీరోయిన్ అయ్యింది. విజయ్ దేవరకొండకు కూడా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది గీత గోవిందం. నిన్న విడుదలైన ట్రైలర్ ఆకట్టుకోగా రష్మిక విజయంపై గట్టి విశ్వాసం వ్యక్తం చేస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios