ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ పై స్ట్రీమింగ్ అవుతున్న వెబ్‌ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతుండటంతో చాలా మంది స్టార్లు ఒక్కొక్కరుగా వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. సరైన ప్రాజెక్ట్‌‌ సెట్‌ అయితే, వెబ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు చాలా మంది స్టార్స్‌ రెడీగా ఉన్నారు. వెబ్‌ సిరీస్‌ ఎంట్రీ ఇస్తు న్న తారల జాబితాలో నటి రాశీ ఖన్నా చేరటానికి సిద్దంగా ఉంది. అయితే ఈ విషయం ఆమె అభిమానులు చాలా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడే ఆమె వెబ్ సీరిస్ లు చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే...ప్రస్తుతం రాశీఖన్నాకు తెలుగు, తమిళ భాషల్లో బాగానే డిమాండ్‌ ఉంది. అయినా ఆమె త్వరలో డిజిటల్ డెబ్యూకు సిద్దంగా ఉందని సమాచారం. ఆమె ఓ హిందీ వెబ్ సీరిస్ సైన్ చేసిందని తెలిసింది. త్వరలోనే ఈ సీరిస్ పట్టాలు ఎక్కనుందని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ఈ వెబ్ సీరిస్ ...సినిమా స్దాయిలో ఉంటుందని, కథ చాలా ఎక్సైటింగ్ గా ఉందని తన సన్నిహితులతో చెప్పుకుని రాశీ మురిసిపోతోందిట. 

ఇక ఈ అమ్మడు తెలుగులో విజయ్‌దేవరకొండకు జంటగా నటించిన వరల్ట్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోసిందంటూ విమర్శలు వచ్చాయి. ఇందుకు స్పందించిన రాశీఖన్నా తానిప్పుడు హీరోయిన్ గా మంచి స్థాయికి చేరుకున్నానంది. ఇకపై తన చిత్రాల కలెక్షన్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొంది. 

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలో అందాల ఆరబోతలో హద్దులు దాటినట్లు, ఇది మీకు అవసరమా అని అందరూ ప్రశ్నిస్తున్నారని.. ప్రస్తుతం తాను హీరోయిన్‌గా మంచి స్థాయికి చేరుకున్న కారణంగా ఇకపై నటిగా మరో మెట్టు ఎక్కేందుకు ఉపయోగపడే పాత్రలనే ఎంచుకుంటానని తెలిపింది. అందుకే ఇకపై గ్లామర్‌ విషయంలో హద్దులు మీరనని చెప్పుకొచ్చింది.