Asianet News TeluguAsianet News Telugu

హీరోయిన్ పెళ్లికి అడ్డంకులు!

నటి పూర్ణ మలయాళీ అయినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. మొదట్లో మోడలింగ్, యాంకరింగ్ చేసి ఆ తరువాత నటిగా మారింది. ఆమె హీరోయిన్ మాత్రమే కాదు.. డాన్సర్ కూడా.. స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ కూడా ఇస్తుంటుంది.

heroine poorna about her marriage
Author
Hyderabad, First Published Oct 16, 2018, 1:12 PM IST

నటి పూర్ణ మలయాళీ అయినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుంది. మొదట్లో మోడలింగ్, యాంకరింగ్ చేసి ఆ తరువాత నటిగా మారింది. ఆమె హీరోయిన్ మాత్రమే కాదు.. డాన్సర్ కూడా.. స్టేజ్ మీద ప్రోగ్రామ్స్ కూడా ఇస్తుంటుంది.

ఆమె తోటి నటీమణులు పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతుంటే పూర్ణ మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. ఇటీవల తన పెళ్లికి సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ''నా పెళ్లి గురించి మా అమ్మ ప్రశ్నించని రోజు ఉండదు. నాకు పెళ్లి చేసుకునే ఆలోచన ఉంది.

కానీ దానికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జాతి సమస్య. దాన్ని దాటి పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అంటున్న వారు పెళ్లైన తరువాత నటనకి, డాన్స్ కి గుడ్ బై చెప్పాలని అంటున్నారు. పోనీ లవ్ మ్యారేజ్ చేసుకుందామంటే అక్కడ మాత్రం ఇలాంటి సమస్యలు రావని గ్యారంటీ ఉంటుందా..?.

ఈ కారణాల వలనే నా పెళ్లి వాయిదా పడుతుంది. జాతి సమస్య లేకుండా, నాకు ఎలాంటి షరతులు విధించని వ్యక్తి ఎదురుపడితే అప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధ పడతాను'' అంటూ తన పెళ్లి విషయాల గురించి వెల్లడించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios