Asianet News TeluguAsianet News Telugu

ఉప్పెన రీమేక్ లో స్టార్ హీరోయిన్ చెల్లులు! ఆయన మాటల అర్థం అదేనా?

బ్లాక్ బస్టర్ ఉప్పెనను హిందీలో రీమేక్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు నిర్మాత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన మాటలను బట్టి చూస్తే... ఓ స్టార్ హీరో చెల్లెలు హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.. 
 

heroine janhvi kapoor sister kushi kapoor will be the heroine in  uppena hindi remake ksr
Author
First Published Mar 22, 2024, 3:50 PM IST

సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం ఉప్పెన. మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి కూడా హీరోగా మొదటి చిత్రం. వైష్ణవ్ తేజ్ కి జంటగా కృతి శెట్టి నటించింది. ఈ ఎమోషనల్ లవ్ డ్రామా ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. కోవిడ్ నేపథ్యంలో నేరుగా ఓటీటీలో విడుదల చేద్దామని అనుకున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యే చిత్రమని వేచి చూసి థియేటర్స్ లో విడుదల చేశారు. 2021లో విడుదల చేసిన ఉప్పెన వంద కోట్లకు పైగా వసూళ్లతో భారీ లాభాలు పంచింది. 

కాగా ఉప్పెన చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే ఆలోచన ఉందని నిర్మాత బోనీ కపూర్ అన్నారు. ఆర్సీ 16 చిత్రాన్ని బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఇటీవల ఆర్సీ 16 పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. జాన్వీ కపూర్, బోనీ కపూర్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ... ఉప్పెన సినిమాను హిందీలో రీమేక్ చేయాలి అనుకుంటున్నాను. మా అమ్మాయి ఖుషి కపూర్ ని ఒకసారి ఉప్పెన మూవీ చూడాలని చెప్పాను... అన్నారు. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

ఒకవేళ ఉప్పెన హిందీలో రీమేక్ చేస్తే ఖుషి కపూర్ నటిస్తుందని ఆయన చెప్పకనే చెప్పాడు. ఖుషి కపూర్ నటిగా మొదటి అడుగు వేసింది. ఆర్చీస్ టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సైతం నటించింది. ఆర్చీస్ నేరుగా నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. శ్రీదేవికి ఇద్దరు కుమార్తెలు కాగా జాన్వీ కపూర్ పెద్దమ్మాయి. ఖుషి కపూర్ చిన్న అమ్మాయి. 

మరోవైపు రెండు టాలీవుడ్ బడా ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న దేవర మూవీలో జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ సెట్స్ పై ఉండగానే ఆర్సీ 16కి హీరోయిన్ గా ఎంపికైంది. దేవర దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. ఆర్సీ 16 వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం కలదు. 

heroine janhvi kapoor sister kushi kapoor will be the heroine in  uppena hindi remake ksr

Follow Us:
Download App:
  • android
  • ios