Asianet News TeluguAsianet News Telugu

ముద్దులు మొహమాటం లేకుండా ఇచ్చేసిన అనుపమ... ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా?


అనుపమ పరమేశ్వరన్ పంథా మార్చింది. గ్లామరస్ హీరోయిన్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది. టిల్లు స్క్వేర్ మూవీలో లెక్కకు మించిన లిప్ లాక్ సన్నివేశాల్లో నటించిన అనుపమ భారీ రెమ్యునరేషన్ రాబట్టారట. హద్దులు దాటి నటించినందుకు ఎంత తీసుకుందో చూద్దాం... 

heroine anupama parameswaran doubles remuneration for tillu square movie ksr
Author
First Published Feb 21, 2024, 3:19 PM IST | Last Updated Feb 21, 2024, 3:19 PM IST

ప్రేమమ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన అనుపమ పరమేశ్వరన్, తెలుగులో 'అ ఆ' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. తెలుగు ప్రేమమ్ లో కూడా ఆమె నటించారు. శతమానం భవతి, ఉన్నది ఒకటే జీవితం చిత్రాలతో అభిమానులను సంపాదించుకుంది. క్యూట్ గా ఉండే అనుపమకు హోమ్లీ రోల్స్ మాత్రమే వచ్చాయి. 

ఆమె గ్లామరస్ రోల్స్ కి దూరంగా ఉన్నారు. అయితే రౌడీ బాయ్స్ మూవీలో మొదటిసారి అనుపమ లిప్ లాక్ సన్నివేశం చేశారు. అప్పట్లో అది సంచలనమైంది. అది జస్ట్ శాంపిల్ మాత్రమే. అసలు తానేంటో టిల్లు స్క్వేర్ మూవీలో చూపించింది. యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డతో మొహమాటం లేకుండా లిప్ లాక్ సన్నివేశాలు చేసింది. అనుపమ రోల్ ఊహించిన దానికంటే బోల్డ్ గా ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 

అయితే ఈ రేంజ్ లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు అనుపమ గట్టిగా ఛార్జ్ చేసిందట. సాధారణంగా అనుపమ సినిమాకు రూ. 1 కోటి నుండి రూ. 1.5 కోట్లు తీసుకుంటుందట. టిల్లు స్క్వేర్ చిత్రానికి మాత్రం ఆమె రెమ్యూనరేషన్ రూ. 2 కోట్లు అంటున్నారు. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదల కానుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios