బాడీ షేమింగ్ కారణంగా తాను ఎదుర్కొన్న సమస్యల గురించి విద్యా బాలన్ ఆవేదన చెందారు. గత కొన్నేళ్లుగా, మహిళల అందం ప్రమాణాలు, శరీర  అనుకూలత విషయంలో విద్యా బాలన్ యాక్టీవ్ స్పీకర్ గా ఉన్నారు. బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ  "చాలా కాలం నేను నా శరీరాన్ని అసహ్యించుకున్నాను. నేను సినిమాయేతర కుటుంబం నుండి వచ్చాను.శరీర ఆకృతి కాపాడుకోవాలని చెప్పడానికి నాకు ఎవరూ లేరు . అప్పట్లో నేను బరువు పెరగడం, అదేదో జాతీయ సమస్యగా అందరూ మాట్లాడుకున్నారు. నేను చిన్నప్పటి నుండి సహజంగా లావుగానే ఉండేదానిని.  బరువులో మార్పులు వస్తూ పోతూ ఉండేవి అని విద్యా బాలన్ మీడియాతో అన్నారు. 

మనల్ని మనం ప్రేమించడం అంత సులువైన విషయం కాదని ఆమె అన్నారు. హార్మోన్ల సమస్య కారణంగా నేను బరువు పెరిగాను. అధిక బరువు నన్ను అసహనానికి గురి చేసేది. నా శరీరాన్ని నేను ఇష్టపడే దానిని కాదు. అధిక బరువు నన్ను ఒత్తిడికి గురిచేసేది అని విద్యాబాలన్ తెలియజేశారు.

నెమ్మదిగా తనని తాను ప్రేమించడం మొదలుపెట్టిన విద్యా, అధిక బరువు సమస్య నుండి బయటపడ్డారట.  శరీరంపై ద్రుష్టి పెట్టి ఆత్మ విశ్వాసంతో అనుకున్నది సాధించానని ఆమె తెలిపారు. సిల్క్ స్మిత బయోపిక్ గా తెరకెక్కిన డర్టీ పిక్చర్ మూవీలో విద్యా బాలన్ హీరోయిన్ గా నటించారు. తన ఇమేజ్ కి భిన్నంగా విద్యా చేసిన రోల్ అప్పట్లో సంచలనంగా మారింది. ఇక తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్యకు జంటగా విద్యా బాలన్ నటించారు.