మాజీ హీరోయిన్ రేణూ దేశాయ్ చాలా కాలం తరువాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె ఓ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది. కాగా సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట చిత్రంలో రేణూ ఓ పాత్ర చేస్తున్నారంటూ వార్తలు రావడం జరిగింది. సర్కారు వారి పాటలో కీలకమైన మహేష్ వదిన పాత్ర కోసం రేణూ దేశాయ్ ఎంపికయ్యారని సదరు కథనాల సారాంశం. 

కాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు రేణూ దేశాయ్. తన ఫ్యాన్స్ తో ఇంస్టాగ్రామ్ లైవ్ చాట్ లో పాల్గొన్న రేణూ దేశాయ్ ని, ఓ నెటిజెన్ ఇదే ప్రశ్న అడగడం జరిగింది. దీనితో అలాంటిది ఏమీ లేదని, మహేష్ వదిన పాత్ర కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదని అన్నారు. సర్కారు వారి పాట మూవీలో నేను నటిస్తున్నాని వస్తున్న వార్తలో నిజం లేదని ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా మేజర్ మూవీలో నటిస్తున్నట్లు నిరాధారమైన వార్తలు వచ్చాయని ఆమె గుర్తు చేశారు. 

పలు ఇంటర్వ్యూలలో మహేష్ మూవీలో ఏ పాత్ర చేయడానికైనా సిద్దమే అని రేణూ చెప్పడం జరిగింది. వీటిని ఆధారంగా చేసుకుని కొందరు ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని అర్థం అవుతుంది. ఒక ప్రక్క నటిగా అవకాశాలు అందుకుంటూనే... దర్శకత్వం కూడా చేయాలని రేణూ అనుకుంటున్నారు. ఆమె దర్శకత్వం వహించాల్సిన ఓ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, అలాగే రైతుల సమస్యలపై మరో చిత్రం తెరకెక్కిస్తానని రేణూ చెప్పడం విశేషం.