స్టార్ లేడీ రష్మిక మందాన (Rashmika Mandanna)విజయ్ ఫేమస్ సాంగ్ అరబిక్ కుత్తు కి డాన్స్ చేసింది. అది కూడా బాలీవుడ్ యంగ్ హీరోతో కలిసి. మినీ స్కర్ట్ లో రష్మిక సూపర్ గ్లామరస్ గా ఉండగా వీడియో పిచ్చ వైరల్ అవుతుంది.


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ మూవీ బీస్ట్. ఈ మూవీలోని అరబిక్ కుత్తు వీడియో సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కంపోజ్ చేసి పాడిన ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక యోట్యూబ్ లో ఈ సాంగ్ వీడియో ఏకంగా 150 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఇక సామాన్యులతో పాటు సెలెబ్రిటీలు కూడా అరబిక్ కుత్తు(Arabic Kuthu) సాంగ్ కి స్టెప్స్ వేస్తున్నారు. కాగా ఈ సాంగ్ కి స్టార్ హీరోయిన్ రష్మిక మందాన స్టెప్స్ వేశారు. 

బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ తో కలిసి రష్మిక అరబిక్ కుత్తు సాంగ్ కి జోష్ ఫుల్ స్టెప్స్ వేశారు. ఆమె మూమెంట్స్ కి తోడు గ్లామర్ తోడు కావడంతో వీడియో వైరల్ అవుతుంది. మినీ స్కర్ట్ ధరించిన రష్మిక మందాన లుక్ మైండ్ బ్లాక్ చేస్తుంది. కాగా సమంత (Samantha) ఎయిర్ పోర్ట్ లో ఈ సాంగ్ కి స్టెప్స్ వేశారు. అలాగే కీర్తి సురేష్ సైతం అరబిక్ కుత్తు సాంగ్ కి డాన్స్ చేయడం జరిగింది. సెలెబ్రిటీలు కూడా ఆడిపాడేలా ఈ సాంగ్ ఫేమస్ అయ్యింది. అరబిక్ కుత్తు సాంగ్ కి హీరో శివ కార్తికేయన్ సాహిత్యం అందించడం మరొక విశేషం. 

View post on Instagram

కాగా బాలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో రష్మిక ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రకు జంటగా రష్మిక నటించిన మిషన్ మజ్ను షూటింగ్ పూర్తి అయ్యింది. అలాగే గుడ్ బై మూవీ చిత్రీకరణ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం. గుడ్ బై మూవీలో అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీటితో పాటు పుష్ప 2 షూటింగ్ లో రష్మిక జాయిన్ కావాల్సి ఉంది. పుష్ప ది రూల్ చిత్రీకరణ లొకేషన్స్ ఎంపిక కూడా పూర్తయింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. 2022 చివర్లో పుష్ప 2 విడుదల కానుంది.