పాయల్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమె లేటెస్ట్ రిలీజ్ డిస్కో రాజా ఘోర పరాజయం అందుకుంది. ప్రస్తుతం పాయల్ కి చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. టూ టైర్ హీరోల పక్కన కూడా పాయల్ కి అవకాశాలు రావడం లేదు. తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న పాయల్, తమిళంలో ఓ హారర్ కామెడీ మూవీ చేస్తున్నారు. 

సినిమా అవకాశాలు లేని పాయల్ డబ్బులు వచ్చే ఎటువంటి మార్గాన్ని వదలడం లేదనిపిస్తుంది. అందుకే ఆమె ఈవెంట్స్, బ్రాండ్ ప్రొమోషన్స్ పై కూడా ద్రుష్టి పెట్టారు. తాజాగా పాయల్ సోషల్ మీడియాలో ఓ ఫోటో పంచుకున్నారు. విస్కీ బ్రాండ్ రాయల్ ఛాలెంజ్ ని ఆమె ప్రమోట్ చేస్తూ పోస్ట్ పెట్టారు. 

చేతిలో విస్కీ పోసిన గ్లాసు పట్టుకున్న పాయల్  రాయల్ ఛాలెంజ్ ఇండియన్ మాల్ట్స్ తో  అద్భుత సమ్మేళనంతో కూడిన స్కాచ్. స్మూత్ అండ్ సూపర్ టేస్ట్...వేడుక ఏదైనా సెలెబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ డ్రింక్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తూ పోస్ట్ పెట్టింది. తెలంగాణా రాష్ట్రంలో రాయల్ ఛాలెంజ్ బ్రాండ్ ని పాయల్ ప్రమోట్ చేస్తున్నారు. డబ్బుల కోసం కొందరు స్టార్స్ హానికరమైన మత్తు పానీయాలకు కూడా ప్రచారం కలిపిస్తున్నారు. లేడీ అయ్యుండి పాయల్ విస్కీని ప్రమోట్ చేయడం కొంచెం బోల్డ్ చర్యనే అనాలి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Payal Rajput (@rajputpaayal)