బాలీవుడ్ ఐటెం బాంబ్ గా పేరున్న మలైకా అరోరా కొడుకు అర్హాన్ ఖాన్ తో క్రికెట్ ఆడుతూ కెమెరా కంటికి చిక్కారు. జిమ్ వేర్ లో ఉన్న మలైకా ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడారు. బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేస్తూ తన స్టామినా ఏమిటో నిరూపించారు. మలైకా క్రికెట్ పోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షూటింగ్ నుండి విరామం దొరకడంతో  ఆటవిడుపుగా మలైకా, అర్హాన్ క్రికెట్ ఆడడం జరిగింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nir_haan (@nir_haan)

ఆ మధ్య కరోనా బారిన పడిన మలైకా హోమ్ కొరెంటైన్ లో ఉండి చికిత్స తీసుకున్నారు. మలైకా కరోనా నుండి త్వరగానే కోలుకున్నారు. ఫిట్నెస్ విషయంలో ఎంతో శ్రద్ధగా ఉండే మలైకా ప్రతి రోజు జిమ్ మరియు యోగాసనాలు చేస్తారు. 47ఏళ్ల మలైకా ఇప్పటికీ పర్ఫెక్ట్ బాడీ షేప్ మైంటైన్ చేస్తున్నారు. యోగాసనాలతో బాడీని విల్లులా వంచుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nir_haan (@nir_haan)

ఇక బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో మలైకా ఎఫైర్ సాగిస్తున్నారు. వీరిద్దరి వయసులో 10ఏళ్లకు పైగా వ్యత్యాసం ఉండగా, వీరి ఎఫైర్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. ముంబైలో పబ్లిక్ గానే ఈ జంట తిరుగుతూ ఉంటారు. చాలా కాలంగా ఎఫైర్ సాగిస్తున్న ఈ జంట పెళ్లి చేసుకునేది ఎప్పుడనేది ఆసక్తికరం. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nir_haan (@nir_haan)

సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ని 1998లో మలైకా ప్రేమ వివాహం చేసుకున్నారు. 2017లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అర్భాజ్ ఖాన్ మలైకాతో విడిపోవడానికి కారణం అర్జున్ కపూర్ తో ఎఫైర్ నే కారణం అని వినికిడి.