మలయాళ బ్యూటీ లక్ష్మీ మీనన్ బిగ్ బాస్ షోపై సంచలన కామెంట్స్ చేశారు. అది ఒక చెత్త షోగా ఆమె వర్ణించడం జరిగింది. తమిళ బిగ్ బాస్ సీజన్ 4లో లక్ష్మీ మీనన్ పాల్గొననుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో లక్ష్మీ మీనన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ హోస్ట్ గా బిగ్ బాస్ తమిళ్ మూడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. సీజన్ 4 అక్టోబర్ 4వ తేదీ నుండి గ్రాండ్ గా మొదలు కానుంది. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ కొన్ని పుకార్లు, కథనాలు బయటికి రావడం జరిగింది. 

హీరోయిన్ లక్ష్మీ మీనన్ సైతం బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొననున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలకు లక్ష్మీ మీనన్ నేరుగా సమాధానం చెప్పారు. ఈ క్రమంలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. బిగ్ బాస్ ఒక చెత్త రియాలిటీ షో, ఒకరు తిన్న ప్లేట్లు మరొకరు కడగాలి, ఒకరు వాడిన టాయిలెట్స్ మరొకరు శుభ్రం చేయాలి. అలాగే కెమెరా ముందు గొడవలకు దిగాలి. అలాంటి పనులు నేను చేయలేను. ఇంత వివరంగా నా అభిప్రాయం చెప్పిన తరువాత నేను షోలో పాల్గొంటానని మీరు అనుకోరని భావిస్తున్నాను అన్నారు. 

ఐతే లక్ష్మీ మీనన్ వ్యాఖ్యలకు కొందరు నెటిజెన్స్ హర్ట్ అయ్యారు. లక్ష్మీ మీనన్ వ్యాఖ్యలు పారిశుధ్య కార్మికుల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆమెను విమర్శించారు. నెటిజెన్స్ కామెంట్స్ కి లక్ష్మీ మీనన్, అది నా వ్యక్తిగత అభిప్రాయం...నేను తిన్న ప్లేటు, నా టాయిలెట్ నేను శుభ్రం చేసుకుంటాను అని వివరణ ఇచ్చారు. ఏదిఏమైనా లక్ష్మీ మీనన్ వ్యాఖ్యలు కోలీవుడ్ లో సంచలనంగా మారాయి.