Asianet News TeluguAsianet News Telugu

ఆ అమ్మాయి ఎవరంటే..? అసలు విషయం వెల్లడించిన విశాల్

ఈమధ్య విశాల్ ఓ అమ్మాయితో న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు కదా.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో క్లారిటీ ఇచ్చాడు తమిళ స్టార్ హీరో.. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే..? 

Hero Vishal clarity about New York Lady Viral JMS
Author
First Published Dec 28, 2023, 8:39 AM IST

రీసెంట్ గా హీరో విశాల్ ఓ అమ్మాయితో కనిపించాడు. ఇద్దరు కలిసి షికార్లు చేయడంతో పాటు.. వారిని చాటునుంచి తీస్తున్న కెమెరా కంట్లో పడకుండా దాక్కొని వెళ్ళడం కనిపించింది. దాంతో విశాల్ గురించి చాలా రకాల కామెంట్లు వనిపించాయి. విశాల్ ను బ్లేమ్ చేయడానికి చాలామంది ప్రయత్నించారు. అంతే కాదు బయట అన్ని మాటలు మాట్లాడే విశాల్ ఇలా చేశాడంటూ మండి పడ్డారు. ఇక విశాల్ కు సపోర్ట్ గా కూడా కామెంట్లు వచ్చాయి. అదంత  ఫేక్.. ప్రమోషన్ కోసం చేశామన్నవారు కూడా ఉన్నారు. ఈక్రమంలో అసలు విషయం ఏంటీ అనేదానిపై క్లారిటీ ఇచ్చాడు తమిళ్ హీరో. ఆ వీడియో ఏంటి.. దాని బ్యాగ్రౌండ్ ఏంటీ.. ? ఆ వీషయంలో తనను ఎలా బ్లేమ్ చేయాలని  చూశారో చెప్పే ప్రయత్నం చేశాడు. ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ విషయాలన్నీ వెల్లడించారు విశాల్. 

ఇంతకీ విశాల్ పోస్ట్ ఏమని పెట్టాడంటే..? క్షమించండి అబ్బాయిలు.. ప్రస్తుతం నా గురించి వైరల్ అవుతున్న వీడియోలో అసలు నిజం ఏంటో వెల్లడించే సమయం వచ్చింది. అవును నేను న్యూయార్క్‌లో ఉన్నాను. ప్రతి ఏడాది ఎండింగ్ లో  మనశ్శాంతి కోసం బంధువులతో కలసి ఇక్కడికి వస్తుంటాను. ఇది నాకు ప్రతీ ఏడాది అలవాటు..ఒక రకంగా అది ఒక ఆచారంగా పాటిస్తున్నాను. ఇక ఇప్పుడు ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం..ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను క్రిస్మస్ రోజున నన్ను ఆట పట్టించాలని నా కజిన్స్ చేశారు. ఈ వీడియో వల్ల నాలో ఎప్పటినుంచో ఉన్న చిన్న పిల్లాడిని బయటకు తీసుకురావడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. అందుకే చేశాను అని అన్నారు. 

 

అంతే కాదు  ఏవేవో ఊహించుకుని ఉంటారు కదా.. ఆ  ఊహగానాలన్నింటికీ ముగింపు పలుకుతున్నాను. అంతే కాదు  ఈ వీడియో రిలీజ్ అవ్వగానే నాపై చాలామందిలోనెగెటీవ్ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. అంతేకాదు నన్ను కొందరు టార్గెట్ చేసేందుకు కూడా గట్టిగా ప్రయత్నించారు. కానీ వాటిని పట్టించుకోను. లవ్ యూ ఆల్ అంటూ రాసుకొచ్చారు విశాల్. ఇక ప్రస్తుతం విశాల్ పోస్ట్ నెట్టింట రచ్చ రచ్చ అవుతోంది. 

ఈ ఏడాది మార్క్ ఆంటోనీ లాంటి హిట్స్ ఇచ్చిన విశాల్ ప్రస్తుతం రత్నం, డిటెక్టివ్ 2 సినిమాల్లో నటిస్తున్నాడు .  రత్నం సినిమాను  హరి డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో పూజ, పొగరు రెండు సూపర్ హిట్స్ వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రత్నం డైరెక్షన్లో నటిస్తున్నాడు  విశాల్. అలాగే డిటెక్టివ్ 2 సినిమా విషయంలో కూడా  విశాల్ స్పీడ్ మీద ఉన్నాడు. స్వయంగా తానే ఆసినిమాకు  దర్శకత్వం వహిస్తున్నారు. 2017లో విడుదలై సూపర్ హిట్ అయిన  డిటెక్టివ్ సినిమాకు సీక్వెల్ గా ఈమూవీ రాబోతోంది. అయితే డిటెక్టీవ్ సినిమాను మిస్కిన్ డైరెక్ట్ చేశాడు.. డిటెక్టీవ్ 2 విషయంలో విశాల్ తో అభిప్రాయ బేధాలు రావడంతో.. స్వయంగా విశాల్ దర్శకత్వం వహిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios