కమల్ హాసన్ గ్లోబల్ స్టార్ అని అన్నారు విక్టరీ వెంకటేష్. నేను కూడా ఆయన నటనను కాపీకొడుతుంటానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ కమల్ గురించి వెంకీ ఇంకేమన్నారు.
కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లీడ్ రోల్స్ లో నటించి, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా విక్రమ్. ఈ సినిమాను తెలుగులో తెలుగులో ఈసినిమాను విక్రమ్: హిట్ లిస్ట్ పేరుతో హీరో నితిన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 3న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.ఇక ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన విక్రమ్: హిట్ లిస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విక్టరీ వెంకటేష్. ఈ సందర్భంగా ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
వెంకటేష్ మాట్లాడుతూ సౌత్ సినిమాలో రెండు శకాలు ఉంటే.. ఒకటి కమల్‌హాసన్‌గారికి ముందు.. మరొకటి కమల్ వచ్చిన తర్వాత అన్నారు. ఆయనతో ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలని ఉంది అని మనసులో మాటను బయట పెట్టిన వెంకటేష్.. నేను నటనలో ఆయన్ను అనుసరిస్తాను అన్నారు. ఎప్పుడైనా డైలాగ్ చెప్పేప్పుడు స్టక్ అయితే.. కమల్ హాసన్ ను గుర్తు చేసుకుంటాను అన్నారు వెంకీ. అంతే కాదు తన ఎక్స్ ప్రెషన్స్ అన్నీ కమల్ హాసన్ వే అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కమల్.
అంతే కాదు కమల్‌గారు నాకు అపూర్వ సహోదరులు అని అన్నారు హీరో వెంకటేష్. కమల్‌గారి పదినారు వయదినిలే తెలుగులో పదహారేళ్ల వయసు సినిమా చూసిన తర్వాత నేను క్లీన్ బౌల్డ్ అయ్యాను... ఆయన నటించిన మరో చరిత్ర ప్రతి యాక్టర్‌కు జీపీఎస్ లాంటిది... దశావతారం లాంటి సినిమా చేయాలంటే ఓ యాక్టర్‌కు ధైర్యం సరిపోదు. ఏక్ దూజే కేలియే తో ఆయన ఫస్ట్ పాన్ ఇండియా స్టార్.. అంటూ కమల్ ను ఆకాశానికి ఎత్తారు వెంకీ. ఈ రోజు కమల్‌గారు గ్లోబల్ స్టార్. యాక్టర్, డైరెక్టర్, రైటర్, సింగర్, కొరియోగ్రాఫర్, పొలిటీషియన్, మంచి మానవతావాది.. ఇలా చెబితే.. దశావతారాలు కాదు.. ఆయనలో శతావతారాలు కనపడతాయి అన్నారు వెంకి.
ఈ సందర్భంగా మాట్లాడిన కమల్ హాసన్ విక్రమ్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న యంగ్ హీరో నితిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 45 ఏళ్ల క్రితం ఏయన్నార్‌గారి శ్రీమంతుడు సినిమాకు డ్యాన్స్ అసిస్టెంట్‌గా హైదరాబాద్ వచ్చాను. అప్పట్నుంచి నేను తెలుగు ఫుడ్ తింటున్నాను. నా కెరీర్‌లో ఎన్నో హిట్స్‌ను తెలుగు ప్రేక్షకులు ఇచ్చారు అని అన్నారు. వెంకటేష్ ను ఉద్దేశిస్తూ.. నా బ్రదర్ ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను, వెంకీగారు మర్మయోగి సినిమా చేయాల్సింది. చేసి ఉంటే మా కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచి ఉండేది అన్నారు. విక్రమ్ సినిమాకు మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమా హిట్ మీ చేతుల్లోనే ఉంది. డైరెక్టర్ లోకేశ్‌గారు నాలాగే (బ్యాక్‌గ్రౌండ్ లేకుండా) ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇలాంటివారిని నేను మరింత గౌరవిస్తాను. ఇండియన్ ఫిల్మ్స్... పాన్ ఇండియా చాలదు.. పాన్ వరల్డ్. అది ప్రేక్షకులు సహకారం లేకుండా జరగదు. మంచి సినిమాలు ఇవ్వండని మీరు డిమాండ్ చేయాలి అని అన్నారు కమల్.
