Asianet News TeluguAsianet News Telugu

నితిన్ షాకింగ్ లుక్ వైరల్... ఇలా మారిపోయాడేంటి?

హీరో నితిన్ వృద్ధుడిగా ఉన్న లుక్ వైరల్ అవుతుంది. దర్శకుడు వెంకీ కుడుముల రాబిన్ హుడ్ 25 ఏళ్ల తర్వాత ఇలా ఉంటాడు అంటూ సదరు వీడియోలో కామెంట్ చేశాడు. ఇంతకీ ఆ కథేమిటో చూద్దాం.. 
 

hero nithiin old look getting viral as well sreeleela ksr
Author
First Published Jul 11, 2024, 8:23 PM IST | Last Updated Jul 11, 2024, 7:52 PM IST


హీరో నితిన్ ఒక్క హిట్ కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. 2020లో విడుదలైన భీష్మ అనంతరం ఆయనకు సక్సెస్ లేదు. నితిన్ గత రెండు చిత్రాలైతే డిజాస్టర్స్. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో హిట్ ఇచ్చిన దర్శకుడిని లైన్లో పెట్టాడు. వెంకీ కుడుమలతో మూవీ చేస్తున్నాడు. టైటిల్ రాబిన్ హుడ్. 

రాబిన్ హుడ్ అంటే తెలిసిందే. పెద్దలను దోచి పేదలకు పెట్టే హాలీవుడ్ ఫిక్షనల్ క్యారెక్టర్. నితిన్ సైతం రాబిన్ హుడ్ మూవీలో దొంగ పాత్ర చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోలు అదే హింట్ ఇస్తున్నాయి. రాబిన్ హుడ్ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా చేయాల్సింది. మొదట సైన్ చేసిన అమ్మడు ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దాంతో శ్రీలీలను తీసుకున్నారు. 

కాగా రాబిన్ హుడ్ సెట్స్ లో ఓ ఫన్నీ ఈవెంట్ చోటు చేసుకుంది. దర్శకుడు వెంకీ కుడుముల ఫేస్ యాప్ తో నితిన్, శ్రీలీలను వృద్ధులుగా మార్చేశాడు. 25 ఏళ్ల తర్వాత రాబిన్ హుడ్, అలాగే రాబిన్ హుడ్ హీరోయిన్ అని ఆ వీడియోలో చెప్పాడు. ఫేస్ యాప్ లో కూడా శ్రీలీల వృద్ధాప్యం కనిపించలేదు. నువ్వు ఇప్పుడు ఉన్నట్లే ఉన్నావని వెంకీ కుడుముల అన్నారు. నితిన్ ఓల్డ్ లుక్ వైరల్ అవుతుంది. 

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాబిన్ హుడ్ తో పాటు తమ్ముడు టైటిల్ తో నితిన్ ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీలో లయ హీరో నితిన్ అక్క పాత్ర చేస్తున్నట్లు సమాచారం.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios