Asianet News TeluguAsianet News Telugu

దసరా రేసులో నిఖల్ స్పై మూవీ, పెద్ద హీరోలతో పోటీకి టాలీవుడ్ యంగ్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరోల లో స్పీడ్ మీద ఉన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. ఈమధ్య గ్యాప్ వచ్చినా.. అందకు ముందు ప్లాప్ లు పలకరించినా.. ఇంకా వేగం పెంచాడే కాని.. నిరుత్సాహపడలేదు. ఇక దసరా బరిల్ పెద్ద సినిమాల మధ్య తన సినిమాను రిలీజ్ చసే ఆలోచనలో ఉన్నాడు నిఖిల్.

Hero Nikhil Spy Movie Release
Author
Hyderabad, First Published May 21, 2022, 2:05 PM IST

కోవిడ్ తో పాటు మరికోన్ని అనుకోని కారణాల వల్ల యంగ్ హీరో నిఖిల్ కి అభిమానులతో చాలా గ్యాప్ వచ్చేసింది. అర్జున్ సురవరం తరువాత ఆయన నుంచి ఇంతవరకూ మరో సినిమా రాలేదు. దాంతో ఇక వరుస సినిమాలను థియేటర్లలో దింపే దిశగా ఆయన ముందుకు వెళుతున్నాడు యంగ్ హీరో. 

నిఖిల్ ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా.. 18 పేజెస్ .. కార్తికేయ 2 లాంటిసినిమాలతో  ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతున్నాడు నిఖిల్. వీటితో పాటు మరికొన్నికథలనుహోల్డ్ లో పెట్టిన నిఖిల్, ప్రస్తుతం మరో సినిమాన్ సెట్స్ ఎక్కించబోతున్నాడు. 

ప్రస్తుతం ఉన్న సినిమాలు రిలీజ్ కు  రెడీ అవుతూ ఉండగానే ఆయన మరో సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు .. ఆ సినిమా పేరే స్పై. ఈడీ ఎంటర్టైన్ మెంట్  సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు. చకచకా ఈ సినిమా షూటింగును జరుపుకుంటోంది. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 

ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ విటేకర్ పనిచేస్తుండటం విశేషం. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే వచ్చే దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు మేకర్స్. 

నిఖిల్ కెరియర్లోనే ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఇక ఈమూవీని దసరాకు రిలీజ్  పక్కా చేస్తే.. పెద్ద సినిమాలకు ఇది పోటీ అనాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న చాలా సినిమాలు దసరాను టార్గెట్ చేసుకుని ఉన్నాయి. తక్కువలో తక్కువ ఐదారు పెద్ద సినిమాలన్నా.. దసరా బరిలో ఉండే అవకావం ఉంది. మరి నిఖిల్ నిజంగానే దసరాకు రెడీ  అవుతున్నాడా అనేది తెలియల్సి ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios