Asianet News TeluguAsianet News Telugu

నాని మళ్లీ రిస్క్ తీసుకుంటున్నాడా..?

నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లో రీమేక్ సినిమాల్లో నటించే ప్రతిసారి ఫ్లాపే చవిచూశాడు. తమిళంలో సక్సెస్ అయిన ఓ సినిమా ఆధారంగా తెరకెక్కిన 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాకి మంచి టాక్ వచ్చినా.. సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది.

hero nani to remake vijay setupathi's 96 movie
Author
Hyderabad, First Published Sep 25, 2018, 11:12 AM IST

నేచురల్ స్టార్ నాని తన కెరీర్ లో రీమేక్ సినిమాల్లో నటించే ప్రతిసారి ఫ్లాపే చవిచూశాడు. తమిళంలో సక్సెస్ అయిన ఓ సినిమా ఆధారంగా తెరకెక్కిన 'భీమిలి కబడ్డీ జట్టు' సినిమాకి మంచి టాక్ వచ్చినా.. సరైన సక్సెస్ ను అందుకోలేకపోయింది.

ఆ తరువాత బాలీవుడ్ లో హిట్ అయిన 'బ్యాండ్ బాజా భారత్'కి రీమేక్ గా 'ఆహా కళ్యాణం' సినిమాలో నటించాడు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తరువాత రీమేక్ ల జోలికి వెళ్లలేదు నాని. ఇప్పుడు మళ్లీ అలాంటి రిస్క్ చేయబోతున్నాడా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తమిళంలో విజయ్ సేతుపతి-త్రిష జంటగా నటించిన '96' సినిమా రీమేక్ హక్కులను సంపాదించాడు నిర్మాత దిల్ రాజు.

ఈ సినిమా ఇంకా రిలీజ్ కానప్పటికీ సినిమా ప్రోమోలు నచ్చి సినిమా స్పెషల్ షో వేయించుకొని చూసి రీమేక్ హక్కులను తన సొంతం చేసుకున్నాడు. ఈ కథను హీరో నానితో చేయాలనేది దిల్ రాజు ప్లాన్. ఈ మేరకు నానికి స్పెషల్ స్క్రీనింగ్ వేసి సినిమా చూపించినట్లు తెలుస్తోంది. నానికి కూడా సినిమా నచ్చిందట. కానీ రీమేక్ సెంటిమెంట్ అతడికి అడ్డొస్తుందని సమాచారం.

కానీ ఇక్కడ నిర్మాత దిల్ రాజు సపోర్ట్ ఉండడంతో '96' గనుక హిట్ అయితే రీమేక్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రీమేక్ నానికి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి!  

Follow Us:
Download App:
  • android
  • ios