Asianet News TeluguAsianet News Telugu

‘దసరా’ షూటింగ్ పై అప్డేట్ ఇచ్చిన నాని.. అంచనాలు పెంచేస్తున్నాడే!

నేచరల్ స్టార్ నాని ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ గా ‘దసరా’ (Dasara) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొద్దిరోజులుగా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. తాజాగా నాని అదిరిపోయే అప్డేట్ అందించారు. 

Hero Nani gave an update on the shooting of Dasara Movie, raising expectations!
Author
First Published Dec 20, 2022, 6:39 PM IST

‘శ్యామ్ సింగరాయ్’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు నేచురల్ స్టార్ నాని (Nani). ఆ జోష్ తో వరుస సినిమాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా నటిస్తున్న ఊరమాస్ అండ్ యాక్షన్ ఫిల్మ్ ‘దసరా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్స్ ట్రెండ్ కొనసాగుతుండటంతో.. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా ఫిల్మ్ గానే రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 

‘దసరా’ నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింమ్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఊరమాస్ లుక్ లో నాని మాస్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. చివరిగా సినిమా నుంచి ‘ధూంధామ్ ధోస్తాన్’ లిరికల్ వీడియో విడుదలైంది. దాదాపు రెండు నెలలుగా సినిమాపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈమూవీ నుంచి  బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని తాజాగా క్రేజీ అప్డేట్ అందించారు. ఇన్ స్టా స్టోరీ ద్వారా షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఫొటోను పంచుకున్నారు. సినిమా లాస్ట్ షెడ్యూల్ ఈరోజే ప్రారంభమైందని తెలిపారు. బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేందుకు సినిమా కోసం శాయశక్తుల కష్టపడుతున్నామని క్యాప్షన్ ద్వారా చెప్పుకొచ్చారు. ఈ షెడ్యూల్ లో క్లైమాక్ట్స్ ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది 15 రోజుల పాటు కొనసాగనుంది. దీని తర్వాత ఒక పాటను మాత్రమే షూట్ చేయాల్సి ఉంటుందని సమాచారం. 

వచ్చే ఏఢాది 2023 మార్చి 30న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్  పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) నాని సరసన మరోసారి నటిస్తోంది. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios