వి మూవీతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు హీరో నాని. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా, సైకో కిల్లర్ గా నాని యాక్టింగ్ సూపర్ అన్నారు ప్రేక్షకులు. ఇక అదే ఊపులో నాని తన 28వ చిత్రం ప్రకటించారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు ప్రీ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ హీరోయిన్ ని కూడా పరిచయం చేశారు.
 
మలయాళ యంగ్ బ్యూటీ నజ్రియా ఫహద్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. నాని చిత్రం ద్వారా మొదటిసారి టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు నజ్రియా ఫహద్. టాలీవుడ్ ప్రతిష్ఠాత్మక సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నవంబర్ 21న ఈ మూవీ టైటిల్ ప్రకటించనున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా దర్శకుడు వివేక్ తెరకెక్కించనున్నాడని సమాచారం. 

వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన బ్రోచేవారెవరురా మూవీ మంచి విజయాన్ని అందుకుంది. క్రైమ్ కామెడీ ప్రధానాంశంగా  తెరకెక్కిన ఆ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచింది. మరో వైపు నాని టక్ జగదీశ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన నిన్ను కోరి మంచి విజయాన్ని అందుకుంది.