Asianet News TeluguAsianet News Telugu

ఓపిగ్గా ఉండండి, సమాధానం దొరుకుతుంది, కళ్యాణ్ దేవ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్, విడాకుల గురించేనా..?

చాలా కాలంగా సైలెంట్ గా ఉంది మెగా డాటర్ శ్రీజ ‌,కళ్యాన్ దేవ్ వ్యవహార. రకరకాలమాటలు వినిపిస్తున్నా.. వీరిద్దరిమధ్య ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలియడంలేదు. ఈక్రమంలో రకరకాల రూయర్స్ వినిపిస్తున్న టైమ్ లో.. కల్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ వైరల్అవుతోంది. 

Hero Kalyan Dev Intresting Post On Instagram
Author
First Published Dec 20, 2022, 1:25 PM IST | Last Updated Dec 20, 2022, 1:27 PM IST

చాలా కాలంగా సైలెంట్ గా ఉంది మెగా డాటర్ శ్రీజ ‌,కళ్యాన్ దేవ్ వ్యవహార. రకరకాలమాటలు వినిపిస్తున్నా.. వీరిద్దరిమధ్య ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలియడంలేదు. ఈక్రమంలో రకరకాల రూయర్స్ వినిపిస్తున్న టైమ్ లో.. కల్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ వైరల్అవుతోంది. 

మెగా ఇంటి చిన్నల్లుడిగా కళ్యాణ్ దేవ్ పరిచయం అవసరం లేదు. అయితే కొంత కాలంగా కల్యాణ్ దేవ్ మెగా అల్లుడి స్టానం నుంచి పక్కకు తప్పుకున్నట్టుగా వార్తలు వనిపిస్తున్న సంగతి తెలిసిందే. విషయం ఏదైనా.. శ్రీజ, కల్యాణ్ దేవ్ విడిగా ఉంటున్నారన్నతి అందరికి తెలిసిన నిజం. ఈక్రమంలో కొన్ని నెలలుగా మెగా కుటుంబానికి కళ్యాణ్ దేవ్ పూర్తిగా దూరమయ్యారని తెలుస్తోంది. శ్రీజ కళ్యాణ్ మద్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారని రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటికి బలం చేకూర్చుతూ.. కళ్యాన్‌, శ్రీజలు కూడా విడిగా ఉంటున్నారు. 

ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ కు మెగా కుటుంబం సపోర్టు కూడా లేకపోవడంతో కళ్యాణ్ దేవ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. శ్రీజ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎవరి దారిన వారే అన్నట్టుగా ఉంటున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు ఇద్దరు స్టార్లు. దాంతో అంతా కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఈక్రమంలోనే కళ్యాన్ దేవ్ పెట్టిన ఓ పెస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా కళ్యాణ్ దేవ్ ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో ఓపికగా ఉండండి.. అన్నిటికి సమాధానం దొరుకుతుంది అంటూ చెప్పుకొచ్చారు. మరి ఇది ఏ ఉద్దేశంతో పెట్టారనే విషయం తెలియాల్సి ఉంది. విడాకుల గురించే ఈ పోస్ట్ పెట్టారంటూ కొందరు అంటుంటే.. అసలు విషయం త్వరలో చెపుతారేమో అని మరికొంత మంది అంటున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)


కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజీగానే ఉంటున్నారు ఎక్కువగా తన ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్కు వెళ్లడం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మెగా అల్లుడుగా మారిన తరువాతే కళ్యాణ్ దేవ్ హీరోగా అవతారం ఎత్తాడు. ఇండస్ట్రీలో  సెటిల్ అయ్యాడు కళ్యాణ్ దేవ్.  విజేత సినిమా ద్వారా టాలీవుడ్కి హీరోగా పరిచయమయిన కళ్యాన్ దేవ్.. ప్రస్తుతం సినిమాలు లేక ఇబ్బందిపడుతున్నారు. మెగా డాటర్  శ్రీజను రెండో పెళ్ళి చేసుకున్నారు  కళ్యాణ్ దేవ్. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios