Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి బరిలో విశ్వంభర? కర్చీఫ్ వేసేసిన చిరు!


చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర విడుదల తేదీ ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి. 
 

hero chiranjeevi starer vishwambhara will be releasing in 2025 sankrathi ksr
Author
First Published Jan 30, 2024, 10:09 AM IST

సంక్రాంతి సీజన్ కి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. సులువుగా వసూళ్లు తెచ్చిపెట్టే పెద్ద పండగకు తమ చిత్రాలు విడుదల చేయాలని దర్శక నిర్మాతలు పోటీపడతారు. టాక్ తో సంబంధం లేకుండా మినిమమ్ వసూళ్లు దక్కుతాయి. 2024 సంక్రాంతి చిత్రాలను పరిశీలిస్తే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న హనుమాన్ వండర్స్ చేసింది. ఏకంగా రూ. 300 కోట్ల వసూళ్ల దిశగా వెళుతుంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న గుంటూరు కారం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. యావరేజ్ టాక్ తెచ్చుకుని కూడా నా సామిరంగ బ్రేక్ ఈవెన్ దాటి హిట్ స్టేటస్ సొంతం చేసుకుంది. 

ఒక్క వెంకీ చిత్రం మాత్రమే ఎక్కువ మొత్తంలో నష్టాలు మిగిల్చింది. ఈ క్రమంలో 2025 సంక్రాంతి పై అప్పుడే కొందరు బడా హీరోలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందట. డేట్ కూడా ఫిక్స్ చేశారట. 10-01-2025న విశ్వంభర విడుదల కానుందంటూ టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. మరి ఇదే నిజమైతే 2025 సంక్రాంతి బరిలో దిగుతున్న మొదటి హీరో చిరంజీవి అవుతారు. విశ్వంభర చిత్రానికి వశిష్ఠ దర్శకుడు. బింబిసార చిత్రంతో పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ ఏకంగా తన కథతో చిరంజీవిని ఇంప్రెస్ చేశాడు. ముందు అనుకున్న ప్రాజెక్ట్ కూడా పక్కన పెట్టి విశ్వంభర తెరపైకి తెచ్చారు. 

విశ్వంభర సోషియో ఫాంటసీ సబ్జెక్టు తో తెరకెక్కుతున్న చిత్రం. చిరంజీవి మూడు లోకాల్లో సంచరిస్తారని, ముగ్గురు హీరోయిన్స్ కి పైగా నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విశ్వంభర సెట్స్ పై ఉంది. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios