అమ్మ కావాలని ఉందన్న గెస్ట్ సమాధానానికి ఎన్టీఆర్ షాక్

నేడు మరో ప్రోమో విడుదల కాగా చాలా ఎమోషనల్ గా సాగింది. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం లో పాల్గొనడానికి వచ్చిన అమ్మాయి, ఎన్టీఆర్ ప్రశ్నకు చెప్పిన సమాధానం ఆయనను షాక్ కి గురి చేసింది. 

here is ntr hosting evaru meelo koteeswarulu latest promo


బిగ్ బాస్ షో హోస్ట్ గా ఎన్టీఆర్ సూపర్ సక్సెస్. తెలుగులో 2017లో మొదలైన మొదటి సీజన్ కి హోస్ట్ గా చేసిన ఎన్టీఆర్ తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు. ఏ మాత్రం తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని బిగ్ బాస్ షో సక్సెస్ వెనక ఎన్టీఆర్ హస్తం ఉంది. చాలా గ్యాప్ తరువాత ఎన్టీఆర్ మరో షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. 


నాగార్జున హోస్ట్ గా గతంలో ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడు కొంచెం పేరు మార్చుకొని జెమినీలో ప్రసారం కానుంది. ఈ షోకి వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ తో కూడా ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోమోలు విడుదల కావడం జరిగింది. 


నేడు మరో ప్రోమో విడుదల కాగా చాలా ఎమోషనల్ గా సాగింది. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం లో పాల్గొనడానికి వచ్చిన అమ్మాయి, ఎన్టీఆర్ ప్రశ్నకు చెప్పిన సమాధానం ఆయనను షాక్ కి గురి చేసింది. నీవు ఏమి కావాలనుకుంటున్నావని ఆ యువతిని ఎన్టీఆర్ అడుగగా... అమ్మ కావాలనుకుంటున్నాని, భిన్నమైన సమాధానం చెప్పింది.


పైలట్ అయితే విమానం, కలెక్టర్ ఒక జిల్లాను, సీఎం ఒక రాష్ట్రాన్ని నడపగలరు. ఒక్క అమ్మ మాత్రమే సమాజాన్ని నిర్మించగలడు.అందుకే నేను అమ్మ కావాలనుకుంటున్నానని వివరణ ఇచ్చింది. ఎమోషనల్ గా సాగిన ప్రోమోలో.. ఇక్కడ మనీ మాత్రమే కాదు, మనసులు కూడా గెలుచుకోవచ్చని, ఎన్టీఆర్ చెప్పడం బాగుంది. కోటి మీది ఆట నాది అనే ఎన్టీఆర్ సిగ్నేచర్ డైలాగ్ అదిరింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios