Asianet News TeluguAsianet News Telugu

ప్రేమ, పెళ్లి పేరుతో హీరో మోసం,రెజీనా కూడా...

చిన్న సినిమాలకు పెద్ద దిక్కు హారర్ లేదా సస్పెన్స్ థ్రిల్లర్. ఈ జానర్ లో అయితే బడ్జెట్ కంట్రోలులో ఉంటుంది. 

Havish's 7 Movie Theatrical Trailer
Author
Hyderabad, First Published May 10, 2019, 12:57 PM IST

చిన్న సినిమాలకు పెద్ద దిక్కు హారర్ లేదా సస్పెన్స్ థ్రిల్లర్. ఈ జానర్ లో అయితే బడ్జెట్ కంట్రోలులో ఉంటుంది. ఓ ఢిపరెంట్ సినిమా ఇచ్చినట్లుంది.  హవీష్ హీరోగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ ‘సెవెన్’. రెజీనా, నందితా శ్వేత, అనీషా ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్స్ . రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.   క్రైమ్‌, థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. 

‘ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువతులను మోసం చేసి పారిపోయిన కార్తీక్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు’ అన్న మాటలతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. కార్తీక్‌ ఒక్కడేనా, లేక ఇద్దరా? ఆ అమ్మాయిలను మోసం చేసి పారిపోయిందెవరు? అనే పాయింట్ ని ఎలివేట్ చేస్తూ ఈ ట్రైలర్ సాగింది. 

రమేష్ వర్మ మాట్లాడుతూ.. ‘‘ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. సినిమా బాగా వచ్చింది. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు అందని మలుపులతో కథనం సాగుతుంది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి ట్విస్ట్ వెనుక కథలో భాగంగా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది.’ అన్నారు.

అలాగే అసలు ఈ సినిమాకు ‘7’ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెహమాన్‌, హవీష్‌, నందిత శ్వేత, అనీషా ఆంబ్రోస్‌, రెజీనా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘7’. నిజార్‌ షఫీ దర్శకుడు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios