అవును’ సినిమా ఫేం హర్షవర్ధన్‌ రాణే. హర్షవర్ధన్‌ రాణే కొవిడ్‌-19 పాజిటివ్‌గా  నిర్దారించారు. దీంతో ఆయన సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. జ్వరం, కడుపు నొప్పి ఉండగా.. హాస్పటిల్ కు వెళ్తే కొవిడ్‌ పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. దీంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. 

పుల్కిత్ సామ్రాట్, కృతి కర్బందా, జిమ్ సర్బ్‌తో కలిసి తైష్‌’ చిత్రంలో రాణే నటించారు. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జీ5లో యాప్‌లో అక్టోబర్ 29న విడుదలకానుంది.

హర్షవర్ధన్‌ బాలీవుడ్‌తో పాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించారు. తకిట తకిట సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హర్షవర్ధన్‌... రవిబాబు ‘అవును’, ‘అవును2’ చిత్రాల ద్వారా ఫేమస్‌ అయ్యాడు. తరేవైత ‘ఫిదా’ సినిమాలో అతిథి పాత్రలో కన్పించాడు. 2016లో సనమ్‌ తేరీ కసమ్‌ ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.