Asianet News TeluguAsianet News Telugu

వాల్మీకి టైటిల్‌ వివాదం.. హరీష్ శంకర్ రియాక్షన్!

గత కొద్ది రోజులుగా వరుణ్ తేజ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్   ‘వాల్మీకి’ పై అనంతపురానికి చెందిన వాల్మీకి సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై దర్శకుడు హరీష్ శంకర్  స్పందించారు. 
 

Harish Shankar reply to Valmiki Title issue
Author
Hyderabad, First Published Jul 6, 2019, 6:06 PM IST

గత కొద్ది రోజులుగా వరుణ్ తేజ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్   ‘వాల్మీకి’ పై అనంతపురానికి చెందిన వాల్మీకి సంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై దర్శకుడు హరీష్ శంకర్  స్పందించారు. 

ఈ మేరకు ట్విటర్‌ లో సమాధానమిస్తూ.... ‘వాల్మీకిని పూజించిన రాముడు కూడా ధర్మం కోసం ఫైటింగ్‌ చేశాడు. ఏదేమైనప్పటికీ మేం వాల్మీకి సంఘం అభిప్రాయాల్ని గౌరవిస్తాం. ఈ సినిమాలో హీరో పేరు వాల్మీకి కాదని ముందే చెబుతున్నా. కాబట్టి గొప్ప వాల్మీకి పేరును మా హీరోకు పెట్టలేదు’ అని హరీష్‌ ట్వీట్లు చేశారు.

ఇక వివాద విషయానికి వస్తే..
డబ్బు కోసం ఫైటింగ్‌ సినిమాకు ‘వాల్మీకి’ పేరు పెట్టడాన్ని సహించబోమని అనంతపురం వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు స్థానిక సీఐకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తమిళనాడుకు చెందిన ఓ కథ ఆధారంగా తీసిన సినిమాను తెలుగులో ‘వాల్మీకి’ టైటిల్‌తో తీయడం సరికాదని పేర్కొన్నారు. 

సందేశాత్మక చిత్రానికి కాకుండా రౌడీ మూకల సినిమాకు ఇలాంటి టైటిల్ పెట్టడాన్ని ఖండించారు. వెంటనే సినిమా టైటిల్‌ మార్చకపోతే ఆందోళన చెస్తామని హెచ్చరించారు. దర్శకుడు, నిర్మాతలపై సెక్షన్‌ 295 (ఎ) ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘వాల్మీకి’ సినిమాలో పూజా హెగ్డే  హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్నారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్‌ ఇది.  సెప్టెంబరు 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios