బిగ్ బాస్ లో ఏవీల పర్వం కొనసాగుతుంది. ఇంటిలో ఉన్న ఐదుగురు ఫైనలిస్ట్స్ జర్నీని వీడియో రూపంలో బిగ్ బాస్ చూపిస్తున్నాడు. అలాగే ఇంటి సభ్యుల గురించిన మంచి విషయాలను, వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులను బిగ్ బాస్ తెలియజేస్తున్నాడు. నిన్న ఎపిసోడ్ లో అఖిల్ మరియు అభిజిత్ ల బ్యూటిఫుల్ జర్నీని బిగ్ బాస్ చూపించాడు. కాగా బిగ్ బాస్ హౌస్ లో హారిక జర్నీని బిగ్ బాస్ చూపించాడు. 
 
చోటు అనే ముద్దు పేరు తెచ్చుకున్న హారిక కష్టపడి ఫైనల్ కి వచ్చినట్లు తెలియజేశాడు. తన ఈ ప్రయాణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తనను మబ్బులు కమ్మేయాలని చూసినా... సూర్య కిరణంలా చీల్చుకొని పైకి లేచావు అన్నారు. పెద్ద ధమాకాలా పేలిన చిన్న రాకెట్ గా హారికను అభివర్ణించాడు బిగ్ బాస్. అలాగే 14వారాల హారిక జర్నీని వీడియో రూపంలో బిగ్ బాస్ చూపించారు. 
 
హారిక తన జర్నీని సబంధించిన వీడియో చూసి చాలా ఆనంద పడ్డారు. బిగ్ బాస్ కి ఆమె కృతఙ్ఞతలు  తెలిపారు. ఇంతటితో హౌస్ లో నా పోరాటం ముగిసిందని హారిక అన్నారు. ఇక ఫైనల్ కి వెళుతున్న ఆమెకు బిగ్ బాస్ బెస్ట్ విషెష్ తెలియజేశారు. హారిక బయటికి వచ్చాక, సోహెల్ మరియు అరియనా వెళ్లడం జరిగింది. మొత్తంగా కొద్దిరోజులలో బిగ్ బాస్ సీజన్ 4 ముగియనుండగా ఇంటి సబ్యులకు మరిచిపోలేని జ్ఞాపకాలు పంచుతున్నారు.