గత కొన్ని రోజులుగా హన్సిక పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 4న హన్సిక తన ప్రియుడు సోహైల్ ని వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ సరసన దేశముదురు చిత్రంలో గ్లామర్ మోత మోగించింది హన్సిక. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల యువత హృదయాల్లో కొలువైంది. ఇప్పటికీ హన్సిక గ్లామర్ చూస్తే కుర్రాళ్లకు తెలియని అలజడి మొదలవుతుంది.
గత కొన్ని రోజులుగా హన్సిక పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 4న హన్సిక తన ప్రియుడు సోహైల్ ని వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. జైపూర్ లోని ముంటోడా ప్యాలెస్ లో హన్సిక వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో హన్సిక తన ఫియాన్సీని అభిమానులకు పరిచయం చేసింది. ప్యారిస్ లో ఈఫిల్ టవర్ వద్ద ప్రియుడితో ఉన్న రొమాంటిక్ పిక్స్ ని హన్సిక షేర్ చేసింది.
హన్సికకి కాబోయే వరుడి పేరు సోహైల్ కతూరియా. అతడు ముంబైకి చెందిన వ్యాపార వేత్త. బిజినెస్ పరంగానే సోహైల్, హన్సిక మధ్య పరిచయం ఏర్పడిందట. సోహైల్ కంపెనీలో హన్సికకి షేర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్ ద్వారా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకు వెళ్లేందుకు వివాహం చేసుకోవాలని ఈ జంట డిసైడ్ అయ్యారు.
అయితే హన్సిక వెడ్డింగ్ కవరేజ్ గురించి ఆసక్తికర విషయం వైరల్ గా మారింది. హన్సిక వివాహ వేడుకని ఓ ఓటిటి సంస్థ లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మేరకు ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ మధ్యన నయనతార వివాహ వేడుక విషయంలో కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు నయన్ పెళ్లి వీడియోని ఆ సంస్థ టెలికాస్ట్ చేయలేదు.
హన్సికకి కాబోయే భర్తకి ఇది రెండవ వివాహం. అతడికి ఆల్రెడీ పెళ్ళై డివోర్స్ జరిగినట్లు తెలుస్తోంది. షాకింగ్ విషయం ఏంటంటే సోహైల్ మాజీ భార్య, హన్సిక ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. తన స్నేహితురాలి మాజీ భర్తనే హన్సిక వివాహం చేసుకోబోతోంది.
