ఆపిల్ బ్యూటీ హన్సిక, రొమాంటిక్ హీరో శింబు ఇద్దరూ మాజీ ప్రేమికులు. వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. కొన్నేళ్ల క్రితం ఈ  జంట పెళ్ళికి సిద్ధమయ్యారు కూడా. కానీ విభేదాలతో విడిపోయారు. నయనతార తర్వాత శింబు జీవితంలో మరో ప్రేమ విఫలమైంది. ఆ తర్వాత వీరిద్దరూ వారి వారి చిత్రాలతో బిజీ అయిపోయారు. 

తాజాగా ఈ మాజీ ప్రేమికులు మళ్ళీ ఒక్కటైపోయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. హన్సిక ప్రస్తుతం 'మహా' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం హన్సిక ల్యాండ్ మార్క్ 50వ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ చిత్రానికి జమీల్ దర్శకుడు. గొడవలు విడిపోయిన తర్వాత వీరిద్దరూ జంటగా నటించలేదు. కానీ హన్సిక మహా చిత్రంలో గెస్ట్ రోల్ చేసేందుకు శింబు అంగీకరించాడు. 

వీరిద్దరి మధ్య మళ్లీ స్నేహం చిగురించిందా అని కోలీవుడ్ లో చర్చ మొదలైంది. తాజాగా జమీల్ చేసిన వ్యాఖ్యలతో శింబు, హన్సిక మళ్ళీ ప్రేమాయణం మొదలు పెట్టినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 

శింబు, హన్సిక అభిమానులు తొందర పడకండి.. ఈ మ్యాజిక్ కపుల్స్ ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ చేస్తాం అని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టాడు.