Asianet News TeluguAsianet News Telugu

భార్యతో విడిపోయినట్లు ప్రకటించిన హీరో , కారణం ఏంటంటే?

 ఇలాంటి కీలక తరుణంలో మా ప్రైవసీకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. 

GV Prakash Kumar announces separation from wife jsp
Author
First Published May 14, 2024, 7:36 AM IST

సిని పరిశ్రమలలో ఈ మధ్య కొత్త ట్రెండ్ కి తెరతీసున్నారు సెలబ్రిటీలు. ఎంతో ప్రేమించుకుని..పెళ్లి చేసుకుని.. సంవత్సరాలు సంవత్సరాలు కలిసుండి.. సడెన్ గా విడిపోతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి సంగీతదర్శకుడిగా, హీరోగా సక్సెస్‌ఫుల్‌ పయనం చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి జీవీ.ప్రకాశ్‌కుమార్‌ చేరాడు.   ఆయన భార్య, గాయని సైంధవి (Singer Saidhavi) విడిపోతున్నట్లు ప్రకటించారు. పదకొండేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వారు పోస్టు చేశారు. 

‘‘చాలా ఆలోచించిన తర్వాత ‘సైంధవి, నేను 11 ఏళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకున్నాం. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగుకోసం ఒకరికొకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి కీలక తరుణంలో మా ప్రైవసీకు భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా, స్నేహితులు, అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇక నుంచి మేము వేరవుతున్నట్లు అంగీకరిస్తున్నాం. ఈ నిర్ణయం ఇద్దరికీ ఉత్తమమని నమ్ముతున్నాం. ఈ క్లిష్ట సమయంలో మీ అవగాహన, మద్దతు చాలా అవసరం’’ అని జీవీ ప్రకాశ్‌ పేర్కొన్నారు. 

GV Prakash Kumar announces separation from wife jsp

ఇక ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ (AR Rehaman) మేనల్లుడు అయిన జీవీ ప్రకాశ్‌.. 2013లో తన బాల్య మిత్రురాలు సైంధవీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2013లో వారికి కూతురు పుట్టింది. 

అలాగే జివి ప్రస్తుతం వరస పెట్టి సినిమాలు హీరోగా చేస్తున్నారు. సంగీత దర్శకుడి నుంచి హీరోగా మారిన ఆయన 15 చిత్రాలకు పైనే ప్రధాన ప్రాతల్లో నటించారు.  ఆయన సినిమాల్లో సంభాషణలు, జీవీ.ప్రకాశ్‌కుమార్‌ యాక్షన్‌ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాగే తమిళంలో యుగానికి ఒక్కడు, రాజా రాణి, ‘అసురన్’‌, ‘సురరై పోట్రు’( అకాశమే నీ హద్దు) లాంటి సూపర్‌ హిట్‌ సినిమాలకు పాటలు అందించిన జీవీ ప్రకాశ్‌.. తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, ప్రభాస్‌ చిత్రం ‘డార్లింగ్‌’, ఎందుకంటే ప్రేమంటా, ఒంగోలు గిత్త, రాజాధిరాజా, జెండాపై కపిరాజు తదితర చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios