బిగ్ బాస్ సీజన్ 3 పై గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించలేకపోయిన బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సెలెక్ట్ అయ్యారు. ఇక హౌస్ లో అడుగుపెట్టబోయే పార్టిసిపేట్స్ పై అయితే ఇంకా క్లారిటీ రాలేదు. 

రూమర్స్ ఎన్ని వస్తున్నా కూడా యాజమాన్యం నుంచి పెద్దగా సమాధానం రావడం లేదు. అయితే బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా కూడా షోలో పార్టిసిపేట్ గా అడుగు పెట్టబోతున్నట్లు టాక్ రాగా ఆమె స్వయంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తాను బిగ్ బాస్ షోలో పార్టిసిపెట్ గా ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని సోషల మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. 

ఇక వరుణ్ సందేశ్ - ఆర్జే హేమంత్ - ఇతర ప్రముఖ నటీనటులు యాంకర్స్ షోలో అడుగుపెట్టబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. వారి నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే యాంకర్ శ్రీ ముఖి కూడా బిగ్ బాస్ 3 లో మెరవనున్నట్లు టాక్ వస్తోంది. వీటన్నటిపై సరైన క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.