కుర్ర దర్శకుడితో ప్రేమలో సీనియర్ నటి, 'గుప్పెడంత మనసు'లో హీరోకి తల్లిగా.. భర్తతో విడిపోయినట్లే, ఇలా కంఫర్మ్
బుల్లితెరపై ఇటు తెలుగు, అటు కన్నడలో ఫెమస్ అయిన నటి జ్యోతి రాయ్. తెలుగులో ఆమె ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తోంది. ఈ సిరియాలో హీరోకి తల్లిగా జగతి పాత్రలో జ్యోతి రాయ్ నటిస్తున్నారు.

బుల్లితెరపై ఇటు తెలుగు, అటు కన్నడలో ఫేమస్ అయిన నటి జ్యోతి రాయ్. తెలుగులో ఆమె ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తోంది. ఈ సిరియాలో హీరోకి తల్లిగా జగతి పాత్రలో జ్యోతి రాయ్ నటిస్తున్నారు. ఎన్నో టివి సీరియల్స్ చేసిన జ్యోతి రాయ్ ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు.
సీరియల్స్ తో పాటు జ్యోతి రాయ్ వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్ళు. అయితే ఆమె ఆన్ స్క్రీన్ లుక్స్ కి ఆఫ్ స్క్రీన్ లుక్స్ కి అసలు సంబంధమే ఉండదు. సీరియల్ లో హీరోకి తల్లిగా కనిపించే జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోజులతో పాపులర్ అవుతోంది. అయితే జ్యోతి రాయ్ ప్రస్తుతం కన్నడకి చెందిన ఓ యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.
శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన యువ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో జ్యోతి రాయ్ రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. దీనితో ఆమె పర్సనల్ లైఫ్ గురించి లోతుగా చర్చ జరుగుతోంది. జ్యోతి రాయ్ కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
కానీ అనూహ్యంగా జ్యోతి రాయ్.. సుకు పూర్వాజ్ తో ఎఫైర్ మొదలు పెట్టడంతో ఆమె తన భర్త నుంచి విడిపోయినట్లు చెప్పుకుంటున్నారు. సుకుతో జ్యోతి తన రిలేషన్ ని సోషల్ మీడియాలో చెప్పకనే చెప్పింది. అతడిని కౌగలించుకుని ఉన్న ఫొటోస్ ని పోస్ట్ చేసింది. అంతే కాదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. తాళి బొట్టు కనిపించేలా సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన జ్యోతి ఆ వీడియోకి జ్యోతి పూర్వాజ్ అనే హ్యాష్ టాగ్ కూడా పెట్టింది.
తన ఫోటోలకు జ్యోతి పూర్వాజ్ అని వరుసగా హ్యాష్ టాగ్ పెడుతోంది.దీనితో వీరిద్దరి రిలేషన్ కంఫర్మ్ అని నెటిజన్లు భావిస్తున్నారు. జ్యోతి పద్దతిగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించడమే కాదు.. జీన్స్ ధరించి నడుము సొగసు చూపిస్తూ హాట్ హాట్ ఫోజులతో కూడా రెచ్చిపోతోంది.