Asianet News TeluguAsianet News Telugu

ఆ వార్త పులిహారే..ఖండించిన గుణశేఖర్

హిరణ్య కశ్యప మొదలయ్యే లోపు గుణశేఖర్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసాడని.. నెట్‌ఫ్లిక్స్ వాళ్లతో ఎగ్రిమెంట్ అయ్యిందని,ఆ ప్రాజెక్టుపై కొంతకాలం పనిచేసారని, అయితే గుణ వర్క్ స్టైయిల్  నచ్చక నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. తనదో తన మానాన ఏదో స్క్రిప్టు రాసుకుంటూ, డిస్కషన్స్ లో ఉంటే మధ్యలో ఈ పులిహార వార్తలేంటని గుణశేఖర్ కాలింది. వెంటనే ఓ ఖండన ఇచ్చేసారు

Gunashekar Condemns Web Series news
Author
Hyderabad, First Published Oct 4, 2020, 10:08 AM IST

ఒకప్పుడు భారీ గా సెట్స్ వేసి షూట్ చేసే సినిమాలకు కేరాఫ్ ఎడ్రస్ గా ఉన్న గుణశేఖర్ ..‘రుద్రమదేవి’ కత్తియుద్దాలతో మరీ వెనకబడిపోయారు. ఆ సినిమా రిలీజై ఐదేళ్లు కావస్తున్న మరో సినిమా మొదలు కాలేదు. ఇదిగో వస్తోంది..అదిగో మొదలవుతోంది అంటూ హిరణ్యకశ్యప గురించి వార్తలు మీడియాలో రావటమే కానీ, అంతకు మించీ ఏమీ జరగటం లేదు. ఓ రోజు లేటైనా రానా వంటి  ప్యాన్ ఇండియా అప్పీల్ ఉన్న స్టార్, సురేష్ బాబు వంటి నిర్మాత తో జర్ని చేస్తున్నాడు కాబట్టి..ఏదో రోజు సినిమా బయిటకు వస్తుంది. అయితే ఈ మీడియా వాళ్లు ఖాళీగా ఉండరు కదా.. ఆయన మీద ఓ న్యూస్ వండేసారు. 

హిరణ్య కశ్యప మొదలయ్యే లోపు గుణశేఖర్ ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేసాడని.. నెట్‌ఫ్లిక్స్ వాళ్లతో ఎగ్రిమెంట్ అయ్యిందని,ఆ ప్రాజెక్టుపై కొంతకాలం పనిచేసారని, అయితే గుణ వర్క్ స్టైయిల్  నచ్చక నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారని మీడియాలో వార్తలు మొదలయ్యాయి. తనదో తన మానాన ఏదో స్క్రిప్టు రాసుకుంటూ, డిస్కషన్స్ లో ఉంటే మధ్యలో ఈ పులిహార వార్తలేంటని గుణశేఖర్ కాలింది. వెంటనే ఓ ఖండన ఇచ్చేసారు.
 
 తాను నెట్‌ఫ్లిక్స్‌తో కానీ.. మరే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో కానీ అసోసియేట్ కాలేదని.. తనకసలు వెబ్ సిరీస్‌లు చేసే ఆలోచన కానీ, ఆసక్తి కానీ ఎంతమాత్రం లేవని.. కాబట్టి తన గురించి లేని పోని వార్తలు సృష్టించవద్దని అతను ఈ స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. అదండీ మ్యాటర్. 

Follow Us:
Download App:
  • android
  • ios